మగవాళ్లు మొలత్రాడును కట్టుకోవడం సంవత్సరాల నుంచి ఆచారంగా వస్తున్న సంగతి తెలిసిందే. మగవాడి జీవితంలో మొలతాడు ఓ భాగంగా మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మొలతాడు లేకుండా ఉండటం అంటే చనిపోవడమనే అర్థం వస్తుందని జ్యోతిష్కులు చెబుతున్నారంటే మొలత్రాడుకు మన జీవితంలో ఎంత ప్రాధాన్యత ఉందో సులువుగానే అర్థమవుతుంది.
మొలతాడు మగవారికి దిష్టి తగలకుండా కాపాడుతుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా వెల్లడవుతోంది. చిన్న పిల్లలకు మొలతాడు కడితే వారు ఎదుగుతున్న సమయంలో ఎముకలు, కండరాలు సరైన పద్ధతిలో వృద్ధి చెందుతాయని పెద్దలు విశ్వసిస్తారు. బరువు పెరిగే అవకాశం తగ్గించడంలో మొలత్రాడు తోడ్పడుతుంది. మగ పిల్లల్లో పెరుగుదల సమయంలో పురుషాంగం ఎటువంటి అసమతుల్యానికి గురికాకుండ చేయడంలో ఇది తోడ్పడుతుంది.
హెర్నియా వ్యాధి వచ్చే ప్రమాదం సైతం మొలత్రాడు ధరించడం వల్ల తగ్గుతుందని చెప్పవచ్చు. మొలతాడు కట్టుకుంటే రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. మొలతాడును కట్టుకోవడం వల్ల పురుషుల జననేంద్రియాలు ఆరోగ్యంగా ఉంటాయనే నమ్మకం కూడా చాలామందిలో ఉండటం గమనార్హం. మొలత్రాడు ధరించడం వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవు.
మొలతాడు కట్టుకుంటే దృష్టిదోషం తలెత్తే అవకాశాలు ఉండవు. నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చేయడంలో మొలతాడు ఉపయోగపడుతుంది. మొలతాడుకు పిన్నీసులు పెట్టడం సరైన నిర్ణయం కాదు. మొలతాడు ధరించడం వల్ల లాభమే తప్ప నష్టం లేదని కచ్చితంగా చెపవచ్చు.