మెట్లు ఎక్కడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు తెలుసా.. అస్సలు నమ్మలేరంటూ?

మనలో చాలామంది మెట్లు ఎక్కడానికి దిగడానికి అస్సలు ఇష్టపడరు. మెట్లు ఎక్కడం దిగడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయని చాలామంది ఫీలవుతారు. మెట్లు ఎక్కడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా రకాలుగా మెరుగయ్యే అవకాశం ఉంటుంది. వ్యాయామం చేసే అవకాశం లేని వాళ్లు మెట్లు ఎక్కడం దిగడం ద్వారా వ్యాయామాన్ని పూర్తి చేసే అవకాశం ఉంటుంది.

మెట్లు ఎక్కడం వల్ల గుండెకు మంచి వ్యాయామం అందే అవకాశాలు ఉంటాయి. గుండెకు రక్త సరఫరాను పెంచి హార్ట్ ఎటాక్, గుండె సమస్యలు వంటివి రాకుండా చేయడం మెట్లు ఎక్కడం దిగడం ద్వారా సాధ్యమవుతుంది. ట్లు ఎక్కడం వల్ల తొడల నుంచి మోకాళ్లు, కీళ్లు, పాదాల వంటి నడుము కింది భాగంలోని అన్ని కండరాలు బలంగా మారే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బరువులు మోస్తే కండరాలకు అన్ని విధాలుగా ప్రయోజనాలు చేకూరుతాయి.

మెట్లు ఎక్కడం దిగడం ద్వారా బరువును కంట్రోల్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. మెట్లు ఎక్కడం వల్ల శారీరక సామర్థ్యంతో పాటు ఓర్పు పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. మెట్లు ఎక్కడం, బరువు మోసే పనులు చేయడం వల్ల ఎముకల్లో సాంద్రత పెరిగి బలంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ప్రతి రోజూ కనీసం రెండు లేదా మూడు ఫోర్ల మెట్టు ఎక్కడం వల్ల ఒత్తిడి తగ్గి ఆనందంగా ఉండే అవకాశాలు ఉంటాయి.

కణజాలాలకు ఆక్సిజన్ పంపిణీని మెరుగుపరిచి శరీరానికి సహజమైన శక్తిని అందించడంలో శక్తి మెరుగయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న వాళ్లు మాత్రం మెట్లు ఎక్కే, దిగే విషయాలలో వైద్యుల సలహాలను పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు.