బెండకాయలను నీటిలో వేసుకుని పరగడుపున ఆ నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బెండకాయలో నీటిలో కరిగే ఫైబర్ ఉంటుందనే సంగతి తెలిసిందే. రక్తంలో గ్లూకోజ్ శోషణను నెమ్మది చేయడంలో ఇది సహాయపడుతుంది. బెండకాయ రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ నియంత్రణ, జీర్ణవ్యవస్థ మెరుగుపడటం, బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి పెరగడం లాంటి పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
బెండకాయ నీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆకలిని అదుపులో ఉంచుతుంది, అతిగా తినడాన్ని తగ్గిస్తుందని చెప్పవచ్చు. బెండకాయలో విటమిన్ సి, విటమిన్ కె, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. యాంటీఆక్సిడెంట్లు మరియు కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం మరియు రక్తపోటును నిర్వహించడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
బెండకాయలో విటమిన్ కేతో పాటు ఏ, సీ కూడా ఉంటాయి. ఇవి కంటిచూపును మెరుగుపరిచే విషయంలో ఎంతగానో తోడ్పడతాయి. బెండకాయలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి, ఇవి పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయని చెప్పవచ్చు. బెండకాయలో కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని మంటను పూర్తిస్థాయిలో తగ్గిస్తాయని చెప్పవచ్చు. బెండకాయలో ప్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికం. కళ్లకు , ఎముకలకు బెండకాయ చాలా మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు బెండకాయ చాలా మంచిది. పరగడుపున బెండకాయ నీళ్లు తాగడం వల్ల ఈ బెనిఫిట్స్ పొందవచ్చు.