బీటెక్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు?

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. www.powergrid.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

138 ఇంజనీర్ ట్రైనీ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఏప్రిల్ 18వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్ సైట్ లోకి వెళ్లి హోమ్ పేజ్ లో కెరీర్ ట్యాబ్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్ ను పూర్తి చేసి ఫీజును చెల్లించవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ రేంజ్ లో వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. దరఖాస్తు చేసిన తర్వాత ప్రింట్ అవుట్ ను తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుంది.

ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండగా ఈ ఉద్యోగాలకు పోటీ కూడా ఎక్కువగానే ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవర్ గ్రిడ్ నుంచి ఈ మధ్య కాలంలో వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండటం గమనార్హం.