సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 153 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీ, బీఎస్సీ, బీకామ్, బీఏ, సీఏ, పీజీ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్ అయితే ఉంటుంది.
ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలలో అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) 18 ఉద్యోగ ఖాళీలు ఉండగా అకౌంటెంట్ ఉద్యోగ ఖాళీలు 24 ఉండగా అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగ ఖాళీలు 5 ఉన్నాయి. సూపరింటెండెంట్ (జనరల్) ఉద్యోగ ఖాళీలు 11 ఉండగా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 81, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-ఎస్‌ఆర్‌డీ (లడఖ్ యూటీ) ఉద్యోగ ఖాళీలు 2 ఉన్నాయి.
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – ఎస్‌ఆర్‌డీ (ఎన్‌ఈ) ఉద్యోగ ఖాళీలు 10 ఉండగా సూపరింటెండెంట్ (జనరల్)-ఎస్‌ఆర్‌డీ (ఎన్‌ఈ) ఉద్యోగ ఖాళీలు 2 ఉన్నాయి. 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి వయో పరిమితిలో మార్పులు ఉంటాయి.
రిజర్వేషన్ విషయంలో వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. కొన్నిఉద్యోగాలకు అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ పురుష అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1250 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీహెచ్, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 400 రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది. https://www.cewacor.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.