భోజనం చేసే సమయంలో ఈ నియమాలు పాటిస్తే లక్ష్మి దేవి అనుగ్రహం పొందవచ్చు..?

ప్రస్తుత కాలంలో మన ఆహారపు అలవాటులో మార్పులు రావటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ అనారోగ్య సమస్యల వల్ల ఆర్థికంగా కూడా ప్రజలు దెబ్బతింటున్నారు. అయితే వాస్తు శాస్త్ర ప్రకారం భోజనం చేసే సమయంలో కొన్ని నియమాలు పాటించటం వల్ల ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వాస్తు శాస్త్రం భోజనం చేసే సమయంలో కొన్ని నియమాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అందువల్ల భోజనం చేసే సమయంలో కొన్ని నియమాలు పాటించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి పాటించవలసిన నియమాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• ప్రస్తుత కాలంలో బిజీబిజీ పనుల వల్ల కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే చోట కూర్చొని భోజనం చేసే అవకాశం లేకుండా పోయింది. అయితే కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే చోట కూర్చొని భోజనం చేయటం వల్ల ఆ ఇంట్లో సుఖసంతోషాలు ఉండడమే కాకుండా ఆ ఇంట్లో సంతోషం చూసే లక్ష్మీదేవి కూడా ఆ ఇంట్లో కొలువై ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే చోట కూర్చొని భోజనం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లో తిండికి డబ్బుకు లోటు ఏర్పడదు.
• అలాగే కొన్ని సందర్భాలలో మనం తినే ఆహారంలో వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా వెంట్రుకలు కనిపించిన ఆహారం తినడం వల్ల ఆ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది. అంతే కాకుండా అలాంటి ఆహారం తినటం వల్ల అనారోగ్య సమస్యలు మొదలవుతాయి.
• అలాగే ఇంట్లో దంపతులు ఇద్దరు కలిసి ఓకే కంచం లో భోజనం చేయకూడదు. ఇలా భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో తింటే ప్రేమ పెరుగుతుందని అంటారు. కానీ ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి.
• అలాగే భోజనం చేసే ప్లేట్ మీద దాటుకొని వెళ్ళకూడదు. ఒకవేళ అలా దాటుకొని వెళ్ళిన ప్లేట్ లో భోజనం చేయటం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం ఆ ఇంటికి దూరం అవుతుంది.