535 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అత్యంత భారీ వేతనంతో?

డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 535 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జూన్ నెల 19వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం అందుతోంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. https://cdn.digialm.com//per/g01/pub/726/eforms/image/imagedocupload/11/1115551682664438732510.pdf నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఉద్యోగులకు వయో పరిమితి ఆధారంగా సడలింపులు ఉంటాయి. 3 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయని బోగట్టా. ఐదు వేర్వేరు టెస్ట్ ల ద్వారా ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

917353014447 హెల్ప్ లైన్ నంబర్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2023 సంవత్సరం జూన్ నెల 19వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.