సాధారణంగా ఇద్దరు వ్యక్తులు రిలేషన్ లో ఉన్నారంటే వారు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వివిధ రూపాలలో తెలియజేస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రం ప్రేమతో కాకుండా ఇంకా ఏదో ఆశించి రిలేషన్ లో ఉంటారు. అయితే ఇలా రిలేషన్ లో ఉన్నవారు తరచూ ఇలాంటి మాటలను కనుక మాట్లాడుతూ ఉంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని వారు చెప్పే మాటలు అబద్దమని గ్రహించాలి. మరి రిలేషన్ లో ఉన్నవారు ఎలాంటి మాటలు మాట్లాడితే అవి అబద్ధాలు అని విషయానికి వస్తే..
చాలామంది రిలేషన్ లో ఉన్న వారు ఎక్కువగా పదేపదే ఐ లవ్ యు చెబుతూ నేను నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని మాటిమాటికి చెబుతుంటారు. ఇలా చెప్పారు అంటే వారు చెప్పే ఆ మాట అబద్ధమని అర్థం.ఎందుకంటే ప్రేమలో ఉన్నవారు తమన్న ప్రేమను ప్రేమిస్తున్నాను అంటూ చెప్పరని వారు చేసే పనుల ద్వారా చూపిస్తారని తెలుసుకోవాలి. ఇక ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు పొగుడుకుంటూ ఉన్నారు అంటే వారి ప్రేమ అబద్ధం. ప్రేమలో ఉన్న వారు ఎప్పుడూ కూడా ఒకరిపై మరొకరు పొగడ్తలు చెప్పుకోరు.
రిలేషన్లో ఉన్నవారైనా భార్య భర్తలైన కొన్ని రకాల కారణాలతో డబ్బు ఖర్చు చేయకూడదని భావిస్తుంటారు. అయితే భార్య లేదా భర్త అడగకనే నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పడం కూడా పూర్తిగా అబద్ధం.ఇక అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇదివరకే ప్రేమించినటువంటి వారి ప్రియుడు లేదా ప్రియురాలిని మర్చిపోవడం చాలా కష్టం. అయితే ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న వారితో నేను నా మాజీప్రియుడు లేదా ప్రియురాలని మర్చిపోయామని పదేపదే చెబుతున్నారు అంటే వాళ్లు తనని మర్చిపోలేక పోతున్నారని అర్థం. ఇలాంటి మాటలు కనుక చెబుతూ ఉంటే వారు తప్పనిసరిగా అబద్ధం చెప్పారని అర్థం.