KTR: మహబూబాబాద్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. 14 ఏళ్ల కిందట ఇదే మనుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఓ కీలకమైన మలుపునకు కారణమైందని చెప్పారు. ఇప్పుడు అదే మనుకోటలో ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములు గుంజుకుంటా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్న కొత్త నియంతకు బుద్ధిచెప్పేందుకు సిద్దమైందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల నుంచి భూములను చాలా అన్యాయంగా గుంజుకుంటుందని కేటీఆర్ ఈ సందర్భంగా మండిపడ్డారు. ముఖ్యంగా లగచర్ల గ్రామ ఘటన గురించి ఈయన మాట్లాడుతూ రైతులకు మద్దతుగా నిలిచారు. సొంత నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సమయం లేదా అని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.
బలవంతంగా రైతులు భూములు గుంజుకుంటే రేవంత్ రెడ్డికి కచ్చితంగా బుద్ధి చెప్పే సమయం వస్తుందని తెలియజేశారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ ఒకే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ కి ఓటు వేసి తప్పు జరిగింది పొరపాటు జరిగిందని పశ్చాత్తాప పడుతున్నారని తెలిపారు.అసలు ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లో లగచర్లలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి. అక్కడ ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు ఈ ముఖ్యమంత్రి మీద తిరగబడ్డారు.
వారి భూములను తీసుకుంటామని చెబితే ఇక్కడ ఆడబిడ్డలు తొమ్మిది నెలలుగా భూమిని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్నారు. 9 నెలలుగా సొంత నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ ముఖ్యమంత్రికి సమయం లేదు. కానీ ఎక్కే విమానం దిగే విమానం అన్నట్లుగా 28 సార్లు ఢిల్లీకి పోయిండు. కనీసం 28 పైసలు కూడా తేలేదు అంటూ రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పై కూడా ఈయన విమర్శల వర్షం కురిపిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.