ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య బంధం ఎక్కువ కాలం పాటు సవ్యంగా కొనసాగడం లేదు ఇద్దరు కూడా వారి పనుల నిమిత్తం బయటకు వెళ్లి వస్తూ అలసిపోవడంతో ప్రతి చిన్న విషయానికి తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఇలా ప్రతి చిన్న విషయాన్ని గొడవ పడటంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగి వారి బంధం విడిపోయే వరకు వెళ్తోంది.ఇలా భార్యాభర్తల మధ్య బంధం ఎక్కువ కాలం కొనసాగు పోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి మరి ఆ కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం….
భార్యాభర్త ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ముందుగా ఇద్దరి ఇష్ట అయిష్టాలు, ఆర్థికపరమైన అంశాలు, కుటుంబ వ్యవహారాల పట్ల ఇద్దరికీ అవగాహన వచ్చే విధంగా కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి.దాంపత్య జీవనంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఇద్దరు కలిసి సమస్యను పరిష్కరించుకున్నప్పుడు బంధం మరింత బలపడుతుంది. అలాకాకుండా మీ భాగస్వామి పట్ల చిరాకు,కోపం,అసహ్యం వంటి లక్షణాలను ప్రదర్శిస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తి తక్కువ కాలంలోనే విడాకులకు దారి తీయవచ్చు.
ఈ రోజుల్లో ఎక్కువమంది కపుల్స్ విడిపోవడానికి కారణం ఇద్దరి మధ్య సాన్నిహిత్యం లేకపోవడమే. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనురాగాలు ఉన్నప్పటికీ పడకగదిలో మాత్రం శారీరక తృప్తి చెందకపోతే ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తి విడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త పని ఒత్తిడిని తగ్గించుకొని మీ జీవిత భాగస్వామితో కాస్త సమయం కేటాయించడానికి గడపాలి ఇలా ఎప్పుడైతే పని ఒత్తిడి కారణంగా మీ జీవిత భాగస్వామిని దూరం పెడుతున్నారు అప్పుడే ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తి మీ బంధం చీల్పోవడానికి కారణం అవుతుంది.