RGV: రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా వర్మకు విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులను అందజేశారు. అయితే ఈయన మాత్రం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో తాను విచారణకు రాలేనని తనకు కాస్త సమయం కావాలి అంటూ పోలీసులకు వాట్సప్ ద్వారా మెసేజ్ పంపించారు.
మరోవైపు తనపై నమోదైన ఈ కేసును కొట్టివేయాలి అంటూ కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ కోర్టు ఈ పిటిషన్ తిరస్కరించింది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ కి మంజూరు చేసుకున్నారు. ఇక ఈయన విచారణకు రాకపోవడంతో తనని అరెస్టు చేయాలని పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే హైదరాబాదులో ఆయన ఇంటి బయట పోలీసులు కూడా కాపలా ఉండడం పట్ల వర్మ లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనని అరెస్టు చేస్తారని భావించిన వర్మ హైదరాబాదులో లేరని ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలుస్తుంది. అయితే తన ఇంటి బయట పోలీసులు ఉండడం పట్ల వర్మ లాయర్లు స్పందిస్తూ..రామ్ గోపాల్ వర్మకు పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. రెండు నోటీసులకు తాము ఆన్సర్ ఇచ్చాం. ఆయనకు సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ఉండటం వల్ల విచారణకు రాలేకపోతున్నారు.
డిజిటల్ విచారణకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే స్పష్టం చేశాం.. ఈ విషయాన్ని డీఎస్పీకి వాట్సాప్ ద్వారా తెలియజేశాం. అయినా పోలీసులు ఇంటి వరకు రావడం కరెక్ట్ కాదనీ పోలీసుల తీరుపై లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ కేసు నుంచి బయటపడటం కోసం ఈయన క్వాష్ పిటీషన్ వేసినప్పటికీ ఆ పిటిషన్ ని తిరస్కరించారు అందుకే ముందస్తు బెయిల్ కి ఈయన అప్లై చేయగా అవి కూడా విచారణ పెండింగ్ లో ఉన్నాయి అయితే ఈ కేసు విషయంలో వర్మ పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పినట్లు ఈ సందర్భంగా లాయర్లు మరోసారి గుర్తు చేశారు.