తమన్నా పెళ్ళి గోల.! ఏంటీ లీకుల లీల.!

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమలో పడిందట.! పాత గాసిప్పే ఇది.! ఔను, మేమిద్దరం ప్రేమలో వున్నాం.. అని విజయ్ వర్మ చెప్పాడట కూడా.! ప్చ్.. ఇది మాత్రం ఉత్త పుకారు.!

ఇంతకీ, తమన్నా మనసులో ఏముంది.? ‘మేం ప్రస్తుతానికి స్నేహితులం మాత్రమే..’ అని సెలవిచ్చింది తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో. ప్రస్తుతానికి స్నేహితులంటే.. ముందు ముందు ఆ స్నేహం ప్రేమగా మారుతుందా.? ఏమో, మారుతుందేమో.! మారిపోయిందిగానీ, ఇప్పటికైతే స్నేహమే వుందని చెబుతోందేమో.!

బాలీవుడ్ మీడియా మాత్రం, ‘త్వరలో ఈ ఇద్దరూ పెళ్ళి పీటలెక్కబోతున్నారు..’ అని చెబుతోంది. ఆ ఛాన్సే లేదు, జస్ట్ డేటింగులోనే వున్నారు.. పెళ్ళి ఆలోచనే ఇద్దరికీ లేదన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం.! లీకులిచ్చి, పబ్లిసిటీ స్టంట్లు చేయడం.. ఇదో తుత్తి ఇప్పుడు సెలబ్రిటీలకి.!