రష్మికతో దేవరకొండ అసలేంటి కథ.?

వచ్చే ఏడాది రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లంట. అందుకోసం అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయట. తూచ్.! ఇలాంటి ప్రచారాలు చాలాసార్లు విన్నాంలే అనుకుంటున్నారా.? కానీ, ఈసారి కొంచెం గట్టిగా మాట్లాడుకుంటున్నారు. అయితే, ఇటు విజయ దేవరకొండ కానీ, అటు రష్మిక మండన్నా కానీ అబ్బెబ్బే మేం జస్ట్ ఫ్రెండ్స్.. బెస్ట్ ఫ్రెండ్స్.. అని తప్పించుకుంటున్నారంతే.

ఇక్కడ హైద్రాబాద్‌లోనూ, అక్కడ ముంబయ్‌లోనూ ఈ ఇద్దరూ కలిసినప్పుడల్లా తెగ చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. అప్పుడప్పుడూ కెమెరా కంటికి చిక్కినప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించేసుకుంటున్నారు. ఎప్పుడో సడెన్ షాక్ ఇస్తారంటూ ఇన్‌సైడ్‌లో టాక్ బాగా వినిపిస్తోంది.

మరోవైపు ఇద్దరూ తమ తమ కెరీర్‌లో బిజీగా గడుపుతున్నారు. ‘ఖుషి’ షూటింగ్ పూర్తి చేసి, పరశురామ్ సినిమాతో బిజీ అయిపోయాడు విజయ్ దేవరకొండ. అలాగే, రష్మిక బాలీవుడ్ ప్రాజెక్టులతో పాటూ, తెలుగులో ‘పుష్ప 2’ తో బిజీగా వుంది.