సాధారణంగా భార్యాభర్తల మధ్య బంధం కానీ లేదంటే రిలేషన్ లో ఉన్నటువంటి వారి బంధం కానీ దీర్ఘకాలం పాటు కొనసాగి సంతోషంగా ఉండాలి అంటే వారిద్దరి మధ్య ప్రేమ నిజాయితీ నమ్మకం మాత్రమే కాకుండా ఇద్దరి మధ్య వ్యక్తిత్వం కూడా తప్పనిసరిగా ఉండాలని ఇలా ఇద్దరి మధ్య వ్యక్తిత్వం ఉన్నప్పుడే వారి బంధం దీర్ఘకాలం కొనసాగుతుందని చెప్పవచ్చు..మనలో వ్యక్తిత్వంలోకించినప్పుడు ఎదుటివారికి చికాకు, అభద్రతాభావం కలిగి ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ తొందరగా బ్రేకప్ కావడానికి కారణం అవుతుంది. ఒక బంధం దీర్ఘకాలం పాటు కొనసాగాలంటే ప్రేమ నమ్మకం తో పాటు వ్యక్తిత్వం కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
మీ వ్యక్తిత్వాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా కోల్పోకుండా ఉన్నప్పుడే బంధం దృఢంగా ఉంటుంది..కొంతమంది ఏ చిన్న విషయాన్ని అయినా భాగస్వామితో పంచుకోవాలని అనుకుంటారు. దీనివల్ల ఒక్కొక్కసారి ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. అందుకు మనం మన భాగస్వామితో కొన్ని విషయాలను చెప్పకపోవడం మంచిది. మీకు ముందే ఏదైనా లవ్ ఎఫైర్స్ ఉన్నా లేదా కాలేజీలో మీ స్నేహితులతో కలిసి గడిపిన క్షణాలు గురించి చెప్పడం వల్ల అవతలి వారి వ్యక్తిత్వం దెబ్బ తినే అవకాశం ఉంటుంది అందుకే ఇలాంటి విషయాలు చెప్పకపోవడమే మంచిది.
సాధారణంగా పెళ్లి బంధం తర్వాత మిగతా బంధాలకు దూరమవుతుంటారు. అయితే అది అంత మంచిది కాదంటున్నారు రిలేషన్ షిప్ మేనేజర్స్. ఎప్పుడు మీ భాగస్వామితో కాకుండా అప్పుడప్పుడు మీ ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడం వల్ల మీకంటూ ఓ ప్రపంచం ఉంటుంది. మీ భాగస్వామితో కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలు స్నేహితులతో చెప్పుకోవడం వల్ల మనసు తేలికై అది మీ బంధాన్ని బలంగా ఉంచడానకి దోహదం చేస్తుంది.