మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎంతోమంది దేవుళ్లను ఎంతగా నమ్ముతారో మూఢనమ్మకాలను కూడా అంతే గట్టిగా నమ్ముతారు. ఈ క్రమంలోనే ఇంట్లో ఏదైనా జరగరానిది జరిగితే ఏదో ఆశుభం అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు ఇంట్లోకి పక్షులు వచ్చినా కూడా వాటిని చెడుగా భావిస్తుంటారు. అయితే ముఖ్యంగా గుడ్లగూబ కాకి వంటి పక్షులు కనక ఇంట్లోకి వస్తే చెడు శకునం అని భావిస్తారు. మరి ఈ పక్షులు ఇంట్లోకి రావడం వల్ల ఎలాంటి పరిణామాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం అయినప్పటికీ ఆ పక్షిని అశుభంగా పరిగణిస్తారు. గుడ్లగూబ పొరపాటున ఇంట్లోకి కనుక వస్తే ఆ ఇంట్లో పురోగతి మందగిస్తుందని ఆ ఇంట్లో ఎన్నో కష్టాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు. గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం అయినప్పటికీ ఈ పక్ష ప్రభావం ఇంటి పై ప్రతికూల వాతావరణాన్ని చూపిస్తుంది. కేవలం దీపావళి పండుగ రోజున మాత్రమే గుడ్లగూబ రాకను శుభంగా భావిస్తారు.మిగతా సమయంలో గుడ్లగూబ ఇంట్లోకి కనక వస్తే ఎర్రటి తిలకం ఎర్రటి గుడ్డ దానం చేయడం మంచిది.
శని దేవుడి వాహనమైన కాకిని కూడా చాలామంది అశుభంగా పరిగణిస్తారు కాకి ఇంట్లోకి రావడం వల్ల శని ప్రభావం మనపై ఉంటుందని భావిస్తాము. అయితే కాకి ఇంట్లోకి రావడం ఆ శుభం అయినప్పటికీ కొన్నిసార్లు కాకి మన ఇంటి ముందు అరిస్తే శుభం కలుగుతుందని. అదే కాకి చెడు స్వరంతో అరిస్తే ఇంట్లో ఏదో ప్రమాదం జరగబోతుందని సంకేతం. అందుకే ఇలాంటి పక్షులు ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో శాంతి పూజ చేయించడం ఎంతో మంచిది.