తరచూ ఈ పక్షులు ఇంట్లోకి వస్తున్నాయా.. దేనికి సంకేతం?

ఒకానొక సమయంలో ఈ భూమిపై ఎన్నో రకాల పక్షులు సందడి చేస్తూ ఉండేవి అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో రేడియేషన్ కారణంగా ఎన్నో పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. అయితే మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలలో కొన్ని రకాల పక్షులు సందడి చేస్తూ ఉంటాయి. అలాగే మరికొన్ని తరచూ ఇంట్లోకి వచ్చి సందడి చేస్తుంటాయి.అయితే ఇలా ఏ పక్షి మన ఇంట్లోకి రావడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో చూద్దాం..

మన ఇంటిలోకి తరచూ పిచ్చుకలు ఎక్కువగా వచ్చి అరుస్తున్నాయి అంటే అందుకు సంకేతం మన ఇంట్లో ఏదో శుభకార్యం జరగబోతుందని లేదా మన ఇంట్లో సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయని అర్థం. ఈ విధంగా ఇంట్లోకి పిచ్చుకల రాకను శుభసంకేతంగా భావిస్తారు. ఇక తరచూ కాకి అరవడం చాలా శని అని భావిస్తారు.కానీ పితృదేవతలు కాకిలో కొలువై ఉంటారని చాలామంది విశ్వసిస్తుంటారు అందుకే కాకి మన ఇంటి ఆవరణంలో అరిస్తే మన పితృదేవతలు వచ్చారని చాలామంది వాటికి ఆహారం పెడుతుంటారు.

ఇకపోతే మనం ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు కాకి మన నెత్తిపై తంతే ఏదో చెడు జరగబోతుందని అర్థం. గుడ్లగూబ చూడటానికి భయంకరంగా ఉన్నప్పటికీ గుడ్లగూబ రాక శుభ పరిణామం.గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనంగా ఉంటుంది కనుక ఇంటి ఆవరణంలో గుడ్లగూబను చూసిన లేదా మన ఇంట్లోకి వచ్చిన శుభముగా పరిగణిస్తారు. ఇక మన ఇంట్లోకి పాము కనుక వస్తే ఇంట్లో మానసిక ఆందోళనలు ఎక్కువ అవుతాయని అర్థం.