సాధారణంగా కొన్ని జంతువులను పక్షులను ఇంట్లో ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. అయితే కొన్ని పక్షులను మాత్రం ఇంటి దరిదాపులకు రానివ్వటానికి కూడా ఆలోచిస్తారు. కొన్ని రకాల పక్షులన ఇంట్లో పెంచుకోవడానికి ఇష్టపడే వ్యక్తులు కాకి గుడ్లగూబ అంటే పక్షులను ఇంటి దరిదాపులకు కూడా రానివ్వరు. ఇలాంటి పక్షులను ఇంటి దరిదాపుల్లో కనిపిస్తే వాటిని తరిమేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పక్షులు పొరపాటున ఇంట్లోకి ప్రవేశించిన కూడా అది అశుభ్రంగా భావిస్తారు. కాకి గుడ్లగూబ ఇంట్లోకి ప్రవేశించటం వల్ల కుటుంబంలో కలహాలు ఏర్పడటమే కాకుండా ఇంట్లో అశుభం జరుగుతుందని విశ్వాసం.
అయితే పొరపాటున ఇలాంటి పక్షులు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు కొంతకాలం పాటు కుటుంబ సభ్యులు ఆ ఇంటిని వెళ్లాలని పండితులు సూచిస్తుంటారు. ఎందుకంటే కాకి ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఆ ఇంట్లోకి దేవుడు ప్రవేశించినట్లు తెలిపే సంకేతం. శని దేవుడి వాహనమైన కాకి ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఆ కుటుంబంలో శని తాండవిస్తుంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులందరూ కూడా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల కాకి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా దాదాపు ఆరు నెలల పాటు ఆ ఇంటిని వదిలి మరొక ప్రదేశంలో నివసిస్తారు.
ఇక గుడ్లగూబ కూడా లక్ష్మీదేవికి వాహనం అని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ గుడ్లగూబ ని ఇంటి దరిదాపులకు కూడా రానివ్వరు. ఎందుకంటే గుడ్లగూబ చూడటానికి భయంకరంగా ఉండటమే కాకుండా దాని అరుపు కూడా భయంకరంగా ఉంటుంది. అందువల్ల గుడ్లగూబ ఇంటి దరిదాపుల్లో వచ్చి అరవటం వల్ల ఆ ఇంటిలో ఆ శుభం జరుగుతుందని ప్రజల నమ్మకం. అలాగే గుడ్లగూబ ఇంట్లోకి ప్రవేశించిన కూడా అశుభ్రంగా భావిస్తారు. గొర్లగూబ ఇంట్లోకి ప్రవేశించినా కూడా కుటుంబ సభ్యులందరూ కొంతకాలం ఆ ఇంటిని వదిలి వెళ్తారు . అయితే దీపావళి పండుగ రోజున మాత్రమే గుడ్లగూబ రాకను శుభపరిణామంగా పాపిస్తారు. దీపావళి పండుగ రోజున గుడ్లగూబ రావటం వల్ల లక్ష్మీదేవి వచ్చినట్లు భావిస్తారు.