షుగర్, బీపీ పెరిగి బాధపడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!

ప్రస్తుతం ఉన్న కాలంలో అనారోగ్యానికి గురి అయ్యే వారి సంఖ్య రోజుకు పెరుగుతుంది. దీనికి కారణాలు తినే ఆహారం, జీవన విధానంలో మార్పులు, మానసిక ఒత్తిడి, ఉద్యోగంలో ఒత్తిడి ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మన జీవిత ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అవి పాటిస్తే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే జీవించి ఉన్న ఫలితం మాత్రం శూన్యం. ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే బిపి, షుగర్ లాంటి వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పట్టణాలలోనే కాదు పల్లెటూర్లలో కూడా గణనీయంగా పెరిగింది. ఇవి రాకుండా, ఒకవేళ వస్తే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

మనం ఉదయం నిద్ర లేవగానే కచ్చితంగా వ్యాయామం, నడవడం వంటివి చేయాలి. అప్పుడే కడుపులో పేరుకుపోయిన కొవ్వు పదార్థాలు, వ్యర్ధాలు శరీరంలో నిలవవు. తరువాత శుభ్రంగా ఒక అర లీటర్ కు పైగా మంచినీళ్లు తాగినట్లయితే శరీరం లోపల అంతా రిఫ్రెష్ అవుతుంది. బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయకుండా ప్రతిరోజు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ను తక్కువగా తీసుకుంటూ ప్రోటీన్లు, పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎంచుకోవాలి.

మన శరీరానికి కార్బోహైడ్రేట్ లు, ప్రోటీన్లు, న్యూట్రాన్లు, ఐరన్ లాంటివి కావలసినంత సమకూర్చే ఆహారం తీసుకోవాలి. మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఆహారంగా తెల్లగా ఉండే అన్నం తీసుకుంటాము. దీనిని పాలిష్ చేయడం వల్ల పైభాగంలో ఉన్న ప్రోటీన్లు చాలావరకు తొలగిపోయి ఎక్కువగా తీసుకున్నట్లయితే కొవ్వు పెరిగే అవకాశం ఉంది. దీనిని తక్కువగా తీసుకొని కొర్రలు, సజ్జలు, జొన్నలు, లాంటివి తీసుకుంటే అందులో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది.

ఇక రాత్రి భోజనంలో కడుపు కాస్త ఖాళీగా ఉండేటట్టు ఆహారం తీసుకోవాలి. రోజుకు రెండు లేదా మూడుసార్లు స్నాక్స్ లాగా ఫలహారాలు తీసుకోవడం ఆరోగ్యం. ఇలా మనం తినే ఆహారంలో ఏవేవి పుష్కలంగా ఉన్నాయి ఏమేమి లేవు అని గ్రహించి శరీరానికి కావలసినంత అందిస్తే అదే ఆరోగ్యం. కాబట్టి పీచు పదార్థాలు, ఉదయం సాయంత్రం వాకింగ్, వ్యాయామం ల ద్వారా ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది.