Eesha: హారర్‌ థ్రిల్లర్‌ ‘ఈషా’ అందరినీ భయపెడుతుంది, డిసెంబరు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల

Eesha: ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓహారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌, గ్లింప్స్‌ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ ” ఎన్నిసినిమాలు చేసినా, నా ప్రతి సినిమా తొలిసినిమాలా భావిస్తాను. ఈషా దర్శకుడు శ్రీనివాస్‌ నాకు పదిహేను సంవత్సరాల నుంచి తెలుసు. సినిమా అంటే ఎంతో పాషన్‌ ఉన్న వ్యక్తి, ఎంతో ఓపిక, ప్రతిభ ఉన్న దర్శకుడు. 24 క్రాఫ్ట్స్‌పై పట్టు ఉన్న వ్యక్తి. వాసు, వంశీ నాకు సోదరుల లాంటి వారు. నేను ఎప్పట్నుంచో చిన్నసినిమాలను ఆదుకునే వాళ్లు ఎవరైనా ఉండాలని… అనుకునేవాడ్ని. వాసు, వంశీ జర్నీచూస్తే నాకు వాళ్లు చిన్న సినిమాలకు ఇస్తున్న ఆశ, సపోర్ట్‌ ఎంతో గొప్పది. డబ్బుంటే సినిమా చేయవచ్చు.కానీ ఆ సినిమాను థియేటర్‌ వరకు తీసుకెళ్లాలంటే కేవలం డబ్బుంటే సరిపోదు. మంచి ప్లానింగ్‌ కావాలి. అది ఇప్పుడు వాసు, వంశీ చేస్తున్నారు’ అన్నారు.

బన్నీవాస్‌ మాట్లాడుతూ ” మా మీద నమ్మకంతో దామోదర ప్రసాద్‌ గారు ఈ సినిమాను మా చేతిలో పెట్టారు. ఆయన పెట్టుకున్న నమ్మకానికి తగినట్లుగానే ఈసినిమాను జనాల్లోకి తీసుకవెళ్లడానికి కృషిచేస్తాం. విడుదల తేదికి సమయం తక్కువగా ఉన్న మా ఎఫర్ట్‌ అంతా పెడుతున్నాం. నాకు దెయ్యాలు, ఆత్మలు అంటే నమ్మకం లేదు. కానీ ఈ సినిమా చూసిన తరువాత నేను కూడా థియేటర్‌లో నాలుగు సార్లు భయపడ్డాను. దర్శకుడు నా లాంటి వాళ్లను భయపెట్టాడంటే కంటెంట్‌లో దమ్ము ఉందనపించింది. తెలిసి కూడా అందరిని భయపెట్టే సినిమా. అంటే భయపడతారని తెలిసిన భయపడతాం. చివరి పదిహేను నిమిషాలు సినిమా అందరికి ఎంతో థ్రిల్ల్‌ను కలిగిస్తుంది. చివరి పదిహేను నిమిషాలు అందరి హృదయాలకు హత్తకుంటుంది. ఈ మధ్య కాలంలో అరవైకి పైగా సినిమాలు చూశాం. అందులో మూడు సినిమాలు సెలక్ట్‌ చేసుకున్నాను. అందులో ఇది కూడా ఒకటి. ఎవరి డబ్బులు వృథా చేయని సినిమా ఇది. టిక్కెట్‌ ధర కూడా రీజనల్‌బుల్‌గానే ఉంటుంది. ఇక ఈ సినిమాను హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు మాత్రం చూడొద్దు’ అన్నారు.

వంశీ నందిపాటి మాట్లాడుతూ ”ఈ సినిమా చూసిన తరువాత నేను ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నాను. ఈ సినిమా చూసి భయపడ్డాను. డిసెంబర్‌ 12న అందర్ని భయపెడుతున్నాం. మాకు ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఇచ్చిన దామోదర ప్రసాద్‌, నిర్మాతలకు నా థాంక్స్. నేపథ్య సంగీతం అదిరిపోతుంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె మాట్లాడుతూ ” సినిమా సక్సెస్‌ కావాలంటే అన్ని కుదరాలి. ఈ సినిమాకు అన్ని కుదిరాయని,అనూకూలించాయని అనుకుంటున్నాను. ఈ సినిమా షూటింగ్‌ టైమ్‌లోనే మాకు మంచి పాజిటివ్‌ వైబ్‌ వచ్చింది. ఈ సినిమాను చాలా అద్బుతమైన లోకేషన్స్‌లో చిత్రీకరించాం. ఈ చిత్ర సమర్పకుడు దామోదర ప్రసాద్‌ నాకు ఎంతో సపోర్ట్‌ చేశాడు. బన్నీ వాస్‌, వంశీ నందిపాటి ఈ సినిమా విడుదల చేయడం మా సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది’ అన్నారు.

దేవుళ్లపై రేవంత్ రెడ్డి దుమారం || Analyst KS Prasad About Revanth Reddy Comments On Hindu Gods || TR