అరటిపండ్లు కొందరికి హానికరం. ముఖ్యంగా మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, ఉబ్బసం, జీర్ణ సమస్యలతో బాధపడేవారు అరటిపండ్లు తినకూడదు. బరువు ఎక్కువగా ఉన్నా, ఖాళీ కడుపుతో తిన్నా సమస్యలు రావచ్చు. అరటిపండ్లలో చక్కెర శాతం ఎక్కువ, కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండ్లను తినేముందు వైద్యుడిని సంప్రదించాలి.
అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఇది మూత్రపిండాలపై భారం పెంచుతుంది. కాబట్టి మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు అరటిపండ్లు తినకపోవడం మంచిది. అరటిపండ్లు బరువు పెరగడానికి కారణం కావచ్చు, కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు లేదా ఊబకాయంతో బాధపడేవారు తక్కువగా తినాలి.
కొందరికి అరటిపండ్లు తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు. ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి, కాబట్టి ఉదయం అల్పాహారంతో పాటు తీసుకోవడం మంచిది. కొందరికి అరటిపండ్ల వల్ల అలెర్జీలు రావచ్చు. అరటిపండు తిన్న తర్వాత దురద, దద్దుర్లు వంటివి వస్తే అరటిపండ్లను తినడం మానేయడం మంచిది.
బరువు తగ్గాలనుకునే వారితోపాటు డైట్ ఫాలో అయ్యేవారు అరటిపండ్లు తినవద్దని వైద్యులు చెబుతున్నారు. అరటి పండు తింటే వీరిలో అలర్జీ రియాక్షన్స్ మొదలయ్యే ప్రమాదముంది. ఊబకాయం ఉన్నవారు అరటిపండ్లు తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. బరువు సమస్యతో బాధపడేవారు ఉదయం తినకూడదని, రోజంతా ఒక అరటిపండు కంటే ఎక్కువగా తినకూడదని వైద్యులు చెబుతున్నారు.