దేశ రాజకీయాల్లో నరేంద్ర మోడీ ఓ ప్రత్యేకమైన ‘వ్యక్తిత్వం’ కలిగిన రాజకీయ నాయకుడు.! అత్యంత వ్యూహాత్మకంగా బీజేపీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీని పక్కన పెట్టిన ఘనుడాయన. ఎప్పుడు ఎవరి జపం ఎందుకు చేస్తారో.. ఆయనకి తప్ప ఇంకెవరికీ తెలియదు.!
నిన్న హైద్రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అప్పట్లో ఇదే స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న తనను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారంటూ ఆనాటి బహిరంగ సభను గుర్తు చేసుకున్నారు నరేంద్ర మోడీ.
మరి, అదే వేదికగా ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనపై చేసిన వ్యాఖ్యలను గుర్తుంచుకుని, ప్రధాని పదవిలో కూర్చున్నాక, బాధ్యతలు గుర్తెరగాలి కదా.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది. అదే నరేంద్ర మోడీ అంటే.! ఆయనకు ముఖ్యమైన విషయాలు గుర్తుండవ్.!
‘నాతో పవన్ వున్నారు..’ అంటూ చాలా పెద్ద స్టేట్మెంట్ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చేశారు ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభ ద్వారా. పైగా, అది బీసీ గర్జన సభ.! ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ‘నాతో పవన్ వున్నారు’ అనడం చిన్న విషయం కాదు. పవన్ కళ్యాణ్ రేంజ్‌ని పెంచేసిన వ్యాఖ్యలివి.
కానీ, పవన్ కళ్యాణ్‌తో నరేంద్ర మోడీ వుంటారా.? లేదా.? అన్నదే ప్రశ్న ఇక్కడ.! చంద్రబాబునీ గతంలో నరేంద్ర మోడీ పొగిడారు. కేసీయార్‌ని పొగిడిన సందర్భాలూ లేకపోలేదు. ఎవరితోనూ ప్రత్యక్షంగా వైరం వుండదు నరేంద్ర మోడీకి. అవసరార్ధం రాజకీయాలు చేయడంలో మోడీకి సాటి ఇంకెవరూ రారేమో.!
ఒకవేళ పవన్ కళ్యాణ్‌తో నరేంద్ర మోడీ వుంటే, తెలుగునాట రాజకీయాలు వేరే లెవల్లో వుంటాయ్.! కానీ, అది జరిగే పని కాదు.! నరేంద్ర మోడీ రాజకీయం వేరే.!