Tirupathi: తిరుపతి తొక్కిసలాట… ప్రాయశ్చిత్త దీక్ష లేదా డిప్యూటీ సీఎం గారు?

Tirupathi: తిరుపతిలో ఇటీవల చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో భాగంగా 6 మంది మరణించడంతో ఈ ఘటనపై వైకాపా నేతలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కూటమినేతలు సైతం ఇందుకు కారణమైన అధికారుల అందరిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల శ్రీవారి ప్రతిష్ట మసకబారుతుందని తెలిపారు. టీటీడీ పాలన పై పూర్తిస్థాయిలో భక్తులలో నమ్మకం తగ్గిపోతుందని బొత్స తెలిపారు. టీటీడీ చైర్మన్, ఈవో మధ్య సమన్వయ లోపం కారణంగానే ఈ ఘటన జరిగిందని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే తెలుపుతున్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని బొత్స ప్రశ్నించారు.

ఇక ఈ విషయంలో అధికారులదే తప్పు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బహిరంగంగా అందరికీ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే అయితే ఇలా బహిరంగంగా క్షమాపణలు చెబితే పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా.. ఇలాంటి తప్పు జరిగినందుకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగిందని మా ప్రభుత్వం పై బురద జల్లుతూ ప్రాయశ్చిత్త దీక్ష అంటూ తెగ హడావిడి చేశారు.

ఇలా లడ్డు తయారీలో కల్తీ జరిగిందని ఈయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ దుర్గమ్మ మెట్లు కడిగి బొట్లు పెట్టడం తిరుమల కొండపైకి నడిచి వెళ్తూ తెగ హడావిడి చేశారు కానీ ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకు క్షమాపణలు మాత్రమే చెప్పి మౌనం పాటిస్తున్నారు అంటూ బొత్స ప్రశ్నించారు. టీటీడీ ఛైర్మన్, ఈఓ ప్రెస్‌మీట్‌ పెట్టి క్షమాపణలు చెప్పాలని పవన్ కల్యాణ్ చెబుతున్నాడని, క్షమాపణలు చెప్పినంత మాత్రాన వాళ్లు చేసిన పాపాలు కరిగిపోతాయా? పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ సత్యనారాయణ పవన్ కళ్యాణ్ తీరుపై వరుసగా ప్రశ్నలు వేశారు.