Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా సుమారు 2000 కోట్ల వరకు కలెక్షన్లను రాబడుతూ సంచలనాలను సృష్టించింది. అయితే ఈ సినిమా విడుదలై దాదాపు నెల అవుతున్నప్పటికీ ఇంకా ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ అయినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ అరెస్టు కావడం వల్ల పెద్ద ఎత్తున వివాదాలు నెలకొన్నాయి. దీంతో ఈయన ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయారని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా అల్లు అరవింద్ తన 76వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. జనవరి 10వ తేదీ అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో అల్లు కుటుంబంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో అల్లు అరవింద్ కేక్ కట్ చేసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు అయితే ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా కేక్ ఎంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పాలి. పుష్ప తీమ్ తో ప్రత్యేకంగా బన్నీ వాసు ఒక కేక్ తయారు చేయించారు ఎర్ర చందనం నేపథ్యంలోనే ఈ కేక్ తయారు చేయడమే కాకుండా పుష్ప బ్రాండ్ అంటూ చేయి గుర్తును కూడా కేక్ పై వేయించారు.
ఇక ఈ కేక్ పైన పుష్ప కా బాప్ అని కూడా రాసింది ప్రస్తుతం ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఈ కేక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అయితే ఒకవైపు రాంచరణ్ నటించిన సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోవడం, అల్లు అర్జున్ ఇంట్లో ఇలాంటి కేక్ తెప్పించి సంబరాలు చేసుకోవడంతో మరోసారి అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ మొదలైంది.