Roja: అప్పుడు లేచిన నోర్ల ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాయి…. కూటమినేతలను ఏకిపారేసిన రోజా?

Roja: వైకాపా మాజీ మంత్రి రోజా ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఘటన గురించి ఈమె మాట్లాడారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను జారీ చేయడంతో లక్షల అధిక భక్తులు తరలివచ్చారు ఇలా ఒకేసారి భక్తులందరూ రావడంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగి ఆరు మంది భక్తులు చనిపోగా 40 మందికి పైగా గాయాలు పాలయ్యారు.

ఇలా ఇలాంటి ఘటన జరగడంతో ప్రభుత్వం కూడా కొంతమంది అధికారులను సస్పెండ్ చేసింది అయితే కొంతమంది మీడియా వారు మాత్రం ఈ ఘటన వెనుక ఏదో కుట్ర దాగి ఉందంటూ ఈ తప్పును ప్రభుత్వంపై పడకుండా దృష్టి మళ్లిస్తున్నారు. ఈ తరుణంలోనే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అత్యంత పవిత్రమైన తిరుమల దేవస్థానంలో చంద్రబాబు నాయుడు తన మనుషులను పెట్టుకొని ఆరు మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని తెలిపారు.

ఇప్పటివరకూ ఏ ఒక్కరి మీద కూడా కేసు నమోదు చేయలేదని, తన వాళ్లని కాపాడే ప్రయత్నం చేస్తోన్నాడని రోజా విమర్శించారు. కోట్లాదిమంది హిందువులు అన్నా, వారి ప్రాణాలన్నా చంద్రబాబుకు ఎంత గౌరవం అనేది లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. పంతం నానాజీ ఒక్క ప్రొఫెసర్‌ గుబ పగలగొడితే అతనిపై చర్యలు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ కులం అడ్డొచ్చిందని రోజా గుర్తు చేశారు.

బిఆర్ నాయుడు ప్రతిరోజు తన భజన చేస్తున్నాడని అర్హత లేకపోయినా తనకు టీటీడీ చైర్మన్ పదవిని చంద్రబాబు నాయుడు కట్ట పెట్టారు. తన వద్ద సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేసిన సుబ్బారాయుడిని తిరుపతి జిల్లా ఎస్పీగా అపాయింట్ చేశాడని ఫైర్ అయ్యారు కుప్పంలో పర్యటించిన చంద్రబాబు నాయుడు వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని సమీక్షించారా అంటూ ప్రశ్నించారు.

పోలీసులందరినీ తన పర్యటనలో భాగంగా తన చుట్టూ తిప్పుకుంటూ తనకు భద్రత పెంచుకున్న చంద్రబాబు నాయుడు భక్తుల భద్రతను గాలికి వదిలేసారని తెలిపారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేసిన సమయంలో చంద్రబాబు సహా కూటమి నాయకులందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు ఈ ఘటన గురించి ఎందుకు మాట్లాడలేదని ఈమె పురందేశ్వరి వంగలపూడి అనిత దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి వంటి ప్రతి ఒక్కరి పేర్లను ప్రస్తావిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.