మీలో ఈ లక్షణాలు ఉంటే టీ అస్సలు తాగకూడదట.. టీ తాగితే ఇంత ప్రమాదమా?

మనలో చాలామంది టీ ఎంతో ఇష్టంగా తాగుతారు. రోజుకు 5 నుంచి 10 కప్పులు టీ తాగేవాళ్లు కూడా చాలామంది ఉంటారు. అయితే మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తే టీ అస్సలు తాగకూడదు. టీలలో వేర్వేరు ఫ్లేవర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ లక్షణాలు ఉన్నవాళ్లు టీ తాగితే నష్టమే తప్ప ఏ మాత్రం లాభం లేదని కచ్చితంగా చెప్పవచ్చు. ఎసిడిటీ ఉన్నవాళ్లు టీ తాగకుండా ఉంటే మేలు జరుగుతుంది.

గర్భంతో ఉన్న మహిళలు ఎక్కువగా టీ తాగడం మంచిది కాదు. గర్భిణీ మహిళలు టీ తాగడం వల్ల కెఫిన్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఐరన్ లోపం సమస్యతో బాధ పడేవాళ్లు టీని ఎక్కువగా తీసుకోకూడదు. టీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఐరన్ శోషణాన్ని అడ్డుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. టీలో ఉన్న టన్నిల్స్ వల్ల కొన్ని రకాల ఎలర్జీలు ఉండే ఛాన్స్ ఉంటుంది.

మధుమేహం సమస్యతో బాధ పడేవాళ్లు షుగర్ బారిన పడే ఛాన్స్ ఉంటుంది. చిన్న వయస్సు ఉన్న పిల్లలు టీ తాగడం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం లేదు. రాత్రి 7 తర్వాత ఎక్కువగా టీ తాగితే కొత్త ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. షుగర్ సమస్య వల్ల దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు.

ఎక్కువగా వ్యాయామం చేయని వాళ్లు టీ తాగడానికి దూరంగా ఉంటే మేలు జరుగుతుంది. టీ తాగే సమయంలో కొన్ని పొరపాట్లు మాత్రం అసలు చేయకూడదు. టీ వల్ల తాత్కాలిక ప్రయోజనాలు ఎక్కువగానే ఉన్నా దీర్ఘకాలంలో టీ వల్ల కలిగే నష్టాలు మాత్రం అన్నీఇన్నీ కావని సమాచారం అందుతోంది.