Dil Raju: ప్లీజ్ నన్ను రాజకీయాలలోకి లాగొద్దు… నేను తెలంగాణ వాడినే…. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు!

Dil Raju: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు సినిమాలకు సంబంధించి మాత్రమే ఈయన వార్తలలో నిలిచారు కానీ ఇటీవల రాజకీయాల పరంగా కూడా దిల్ రాజు పేరు భారీగా మారుమోగుతుంది. దిల్ రాజుకు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజుని నియమించడం, టాలీవుడ్ తరపున మీటింగ్ పెట్టి సీఎంని అందరితో వెళ్లి కలవడం, సంక్రాంతి సినిమాల గురించి తరచూ ప్రెస్ మీట్ లు పెట్టి ఈయన మాట్లాడటంతో ఈయన కాస్త హైలైట్ అయ్యారు.

ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమా వేడుకను తన సొంత జిల్లా ఆయన నిజామాబాద్ లో నిర్వహించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ఆంధ్ర వాళ్ళు సినిమాలకు వైబ్ అవుతారు. మన తెలంగాణలో కళ్ళు, మటన్ కి వైబ్ అవుతారు అని దిల్ రాజు అన్నారు. అయితే దీన్ని కొంతమంది రాజకీయ నాయకులు తప్పుగా అర్థం చేసుకుని పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తున్నారు.

ఇక ఈ విషయం గురించి దిల్ రాజు ఒక వీడియోని విడుదల చేస్తూ తన గురించి వస్తున్నటువంటి వార్తలను పూర్తిగా ఖండించారు. తాను తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కావడంతో నన్ను ఓ రాజకీయ నాయకుడిగా భావిస్తున్నారు ఇది రాజకీయానికి సంబంధించినది కాదని సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య వారధి లాంటిదని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.

ఇక నేను తెల్ల కల్లు మటన్ గురించి మాట్లాడటంతో చాలామంది తెలంగాణ సంస్కృతిని హేళన చేశానని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు. నేను నిజామాబాద్ కి చెందిన వాడిని నేను పక్క తెలంగాణ వ్యక్తినే అయితే సంక్రాంతి సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో దావత్ మిస్ అవుతున్నానని పండగ పూర్తి కాగానే పెద్ద ఎత్తున దావత్ ఏర్పాట్లు చేస్తామన్న ఉద్దేశంతోనే మాట్లాడాను. తెలంగాణని హేళన చేసే వ్యక్తి అయితే మా నిర్మాణ సంస్థలో ఎన్నో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఒక ఫిదా సినిమా కానీ బలగం సినిమా గాని తెలంగాణ సంస్కృతిని కళ్ళకు కట్టేలా చూపించాయని దిల్ రాజు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు బలగం సినిమాని అభినందించారు. తెలంగాణ వాసిని అయిన నేను తెలంగాణను ఎలా హేళన చేస్తాను. నా మాటల వల్ల మనోభావాలు దెబ్బతిన్న వారికి క్షమాపణలు తెలియజేస్తున్నాను అంటూ దిల్ రాజు ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.