Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఇక ఈ పర్యటనలో భాగంగా ఈయన పాతబస్టాండు వద్ద ఉన్న మున్సిపల్ పాఠశాలలో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…నాకు స్వచ్ఛంగా రాజకీయాలు చేయడమే తెలుసు. మండల పరిషత్ అధికారి మీద దాడి జరిగితే ఆయనది ఏ కులం.. ఏ ప్రాంతమని చూడకుండా పరామర్శకు వెళ్లాను. ఓ ప్రభుత్వ అధికారి కొడుకుగా ఈ రాష్ట్ర ప్రజలు పన్నులు కట్టిన జీతం సొమ్మును తిని పెరిగిన వ్యక్తిగా ఏ ప్రభుత్వ అధికారిపై దాడి జరిగిన నేను అలాగే స్పందిస్తానని పవన్ తెలిపారు.
మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ గిరిజన ప్రాంతాలలో ప్రజలు డోలీలలో వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి స్వయంగా నేను గిరిజన ప్రాంతాలు మావోయిస్టు ప్రాంతాలలో పర్యటనలు చేసి వారి సమస్యకు పరిష్కారాన్ని చూపించామని తెలిపారు. ఇక గత ప్రభుత్వ హయామంలో పాడి రైతులకు కూడా ఎంతో నష్టం చేకూరిందని పవన్ తెలిపారు.
పాడి రైతులను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని పవన్ తెలిపారు. రాష్ట్రంలో ఎవరూ బాగుపడకూడదు.. ఎవరి దగ్గరా డబ్బులుండకూడదు అనే ఒకే ఒక సిద్ధాంతంతో లక్షలాది పాడిరైతుల పొట్టకొట్టే చర్యలు అప్పటి పాలకులు చేపట్టారని తెలిపారు. సహకార డైరీలను గాలికి వదిలేసి సొంత డైరీలో అభివృద్ధిలో నిమగ్నమయ్యారని తెలిపారు.
గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో 268 గోకులాలను నిర్మిస్తే మన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే 12,500 నిర్మించి పాడి రైతులకు అండగా నిలిచిందని, ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. రాజకీయం అంటే ఓట్ల కోసం బుగ్గలు నిమరటం ముద్దులు పెట్టడం కాదు.. కష్టంలో ఉన్నవారికి అండగా నిలబడి వారి అభివృద్ధికి తోడ్పడటమే అసలైన రాజకీయం అంటూ ఈ సందర్భంగా పవన్ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.