BR Naidu: తిరుమల తిరుపతి ఘటన రాష్ట్ర రాజకీయాలలో తీవ్రదుమారం రేపుతుంది. ఈ తొక్కిసలాట ఘటనలో భాగంగా సుమారు 6 మంది మరణించగా 40 మందికి పైగా గాయాలు పాలయ్యారు. ఇకపోతే ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా ఈ ఘటన గురించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్షమాపణలు తెలియజేశారు కేవలం అధికారులలో సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని ప్రతి ఒక్కరు క్షమించాలని కోరారు.
ఈ ఘటనలో భాగంగా టీటీడీ పాలక మండలి సభ్యులు కూడా క్షమాపణలు చెప్పాలి అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి నేనే క్షమాపణలు చెప్పాను. వాళ్లు కూడా మరణించిన మృతుల కుటుంబానికి వెళ్లి క్షమాపణలు చెప్పాలి అంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ ఏకంగా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేయటంతో టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు ఈ ఘటనపై స్పందించారు.
ఈ సందర్భంగా బి.ఆర్ నాయుడు మీడియా సమావేశంలో పాల్గొంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. క్షమాపణ చెబితే పోయిన వారు తిరిగి వస్తారా? అంటూ మాట్లాడారు. ఎవరో ఏదో మాట్లాడితే స్పందించాల్సిన అవసరం నాకు లేదని ఈయన మాట్లాడారు. పవన్ వ్యాఖ్యలకు బిఆర్ నాయుడు స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయటంతో తీవ్రస్థాయిలో బి ఆర్ నాయుడు పై విమర్శలు చేస్తున్నారు. కేవలం అధికారులు సరైన భద్రత చర్యలు చేపట్టక పోవటం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని మండిపడుతున్నారు.
ఈ విధంగా తనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈయన చివరికి క్షమాపణలు చెప్పడమే కాకుండా ఈ ఇష్యూలో తనపై పవన్ వ్యాఖ్యలను అపాదించడం భావ్యం కాదన్నారు. అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. సోషియల్ మీడియాలో ప్రతిఒక్కరి కామెంట్స్ కి స్పందించాల్సిన అవసరంలేదనే ఉద్దేశంతోనే ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్లు ఈయన వివరణ ఇచ్చుకున్నారు.