Pawan Kalyan: 15 ఏళ్ల పాటు పొత్తు ధర్మం పాటిస్తాను….అన్నిటికి తెగించే వచ్చాను: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. తన సొంత నియోజకవర్గం అయినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఈయన సంక్రాంతి సంబరాల వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… పిఠాపురం నియోజకవర్గంలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలను ఎంతో ఘనంగా జరుపుకోవాలని భావించాము కాకపోతే తిరుపతి ఘటనతో మా నిర్ణయాలను మార్చుకున్నామని తెలిపారు.

తిరుపతి ఘటన కారణంగా చాలా సింపుల్ గా జరుపుకుంటున్నామని తెలిపారు. దేశం పల్లెల రుణం తీర్చుకోవాలనేది నా కోరిక. ప్రజలు ఇచ్చినటువంటి ఈ విజయంతో మన రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పవన్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక గ్రామాలలోని అధికారులదరూ కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని వారందరికీ మా సహకారం అండదండలు పూర్తిగా ఉంటాయని పవన్ తెలిపారు.

ఇక ఈ సంక్రాంతి సంబరాలు వేడుకలలో భాగంగా ఈయన పొత్తు ధర్మం గురించి కూడా మాట్లాడారు. గతం ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి వచ్చాయి. ఇక ఎన్నికలలో కూడా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక పొత్తు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇంకా 15 సంవత్సరాలు మా పొద్దు ధర్మం కొనసాగుతుందని తెలిపారు.

15 ఏళ్ల పాటు టీడీపీతో కలిసి పని చేయాలని అనుకుంటున్నానని పవన్ స్పష్టం చేశారు. తమ బంధం కచ్చితంగా 15 సంవత్సరాల పాటు కొనసాగుతుందని తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని, భయపడే వాడినైతే రాజకీయాల్లోకి వచ్చే వాడినే కాదన్నారు. అన్నిటికి తెగించే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు. కూటమి విజయం అంటే ప్రజల విజయమని పవన్ కళ్యాణ్ తెలిపారు.