Allu Arjun: అల్లు అర్జున్ కు భారీ ఊరటనిచ్చిన నాంపల్లి కోర్టు!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు భారీ ఊరటను కల్పించింది. డిసెంబర్ 4వ తేదీ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగటంతో అభిమాని మరణించిన విషయం తెలిసిందే. ఇలా అభిమాని మరణించడంతో అందుకు కారణం అల్లు అర్జున్ అని పోలీసులు కేసు నమోదు చేస్తూ ఆయనని ఒక రోజు జైలుకు పంపించారు దీంతో ఇది కాస్త పెద్ద ఎత్తున వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

ఇలా జైలుకు వెళ్లిన అల్లు అర్జున్ కు వెంటనే మద్యంతర బెయిల్ రావడం ఆయన బయటకు రావడం జరిగింది. ఇల 14 రోజులపాటు బెయిల్ పూర్తి కావడంతో తిరిగి మరోసారి బెయిల్ కోసం అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేయగా నాంపల్లి కోర్టు ఈయన పిటిషన్ విచారణ చేసి తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది అయితే కొన్ని షరతులను కూడా విధించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి హాజరుకావాలని కోర్టు తీర్పును ఇచ్చింది.

తాజాగా మరోసారి నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి మరి కాస్త ఊరట కలిగించింది. అల్లు అర్జున్ దేశం దాటి వెళ్ళిపోకూడదని నిబంధన ఉన్న నేపథ్యంలో తాజాగా కోర్ట్ ఈయన విదేశాలకు వెళ్లడానికి కూడా అనుమతిని తెలిపింది. అదేవిధంగా ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని నిబంధనను కోర్టు మినహాయించింది. దీంతో ఈయనకు భారీ ఊరట లభించింది అని చెప్పాలి.

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ కూడా తన సంతోషాన్ని ఆ విజయాన్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితులలో అల్లు అర్జున్ ఉన్నారు సినిమా సక్సెస్ ఈవెంట్లను కూడా నిర్వహించలేకపోయారు. ఇక ఈ సినిమా కోసం గత మూడు సంవత్సరాలుగా ఫ్యామిలీని కూడా పక్కన పెట్టిన అల్లు అర్జున్ కు నేడు కోర్టు తీర్పుతో కాస్త ఉపశమనం లభించిందని చెప్పాలి. విదేశాలకు వెళ్లే అనుమతి కూడా ఉండటంతో అల్లు అర్జున్ కొద్దిరోజుల పాటు సినిమాలను పూర్తిగా పక్కనపెట్టి తన ఫ్యామిలీతో ఆ విలువైన సమయాన్ని గడపబోతున్నారని అనంతరం తిరిగి తన సినిమా పనులలో బిజీ కానున్నారని తెలుస్తుంది.