తెలుగు సినీ పరిశ్రమలో ‘గురువుగారు’ అంటే దాసరి నారాయణరావే. ఆయన శిష్యులు ఎంతోమంది దర్శకులుగా రాణించారు, నిర్మాతలుగానూ ఎదిగారు. నటులుగానూ తమదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక, గురూజీ అంటే అది త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే.! దర్శకుడు సుకుమార్‌కి ‘మాస్టారు’ అనే గుర్తింపు వుంది. ఎందుకంటే, ఆయన గతంలో మాస్టర్‌గా.. అదేనండీ లెక్చరర్‌గా పని చేశారు గనుక.
కానీ, ప్రస్తుతం గురూజీ సుకుమార్.. అంటున్నారంతా. ఎందుకంటే, సుకుమార్ దర్శకులు వరుసగా సక్సెస్ అవుతుండడమే. సుకుమార్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన దర్శకులుగా బుచ్చిబాబు సన, శ్రీకాంత్ ఓదెల.. తాజాగా కార్తీక్ దండు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే.
త్రివిక్రమ్ శిష్యులని చెప్పుకునేవారు చాలామందే వున్నాగానీ, సుకుమార్ లెక్క వేరు.! క్రియేటివ్ పీపుల్ వస్తున్నారు సుకుమార్ స్కూల్ నుంచి. దాంతో, గురూజీ అన్న గౌరవం ప్రస్తుతం సుకుమార్ ముందు వచ్చి చేరింది.