Naga Vamsi: ‘గుంటూరు కారం’ విషయంలో ఏం జరిగిందంటే.. నిర్మాత నాగవంశీ

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమా పై చాలాకాలంగా వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. గత ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం పట్ల అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.

తాజాగా, ‘గుంటూరు కారం’ సినిమాపై నిర్మాత నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సినిమాకు ‘గుంటూరు కారం’ టైటిల్ పెట్టడం వల్ల ఇది మాస్ యాక్షన్ డ్రామా అనుకున్నారు. కానీ ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎమోషనల్ సినిమా. టైటిల్, ప్రచార కంటెంట్ కారణంగా అభిమానులు వేరే తరహా కథను ఊహించారు. ఫలితంగా కొంతమంది నిరాశ చెందారు,” అని నాగవంశీ చెప్పారు.

అయితే, సంగీతం మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని, థమన్ అందించిన పాటలు విజయం సాధించాయని చెప్పారు. “సినిమా కథ అంచనాలను పూర్తిగా అందుకోకపోయినప్పటికీ, మ్యూజికల్ పార్ట్‌తో మంచి కనెక్ట్ ఏర్పడింది. సంక్రాంతి సినిమాగా ఈ చిత్రం మరింత ఆకట్టుకుంటుందని ఆశించాం. కానీ ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తాం,” అని అన్నారు.

ఈ సందర్భంగా, బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ‘డాకు మహారాజ్’ గురించి కూడా నాగవంశీ స్పందించారు. “బాబీతో బాలయ్య సినిమా చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. ఇప్పుడు ‘డాకు మహారాజ్’ రూపంలో ఆ కల నెరవేరుతోంది. బాలయ్యను పూర్తిగా కొత్త లుక్‌లో చూపించబోతున్నాం. ఎన్టీఆర్‌తో కూడా ఒక ప్రాజెక్ట్ ప్లాన్‌లో ఉంది. వివరాలు త్వరలో వెల్లడిస్తాం,” అని చెప్పారు.

పూనం త్రివిక్రం కేసు || Dasari Vignan EXPOSED Poonam Kaur & Trivikram Issue | Manchu Vishnu || TR