చరణ్ సినిమా.! కైరా అద్వానీపై దర్శకుడు శంకర్ గుస్సా.!

క్రియేటివ్ డైరెక్టర్ శంకర్‌ డైరెక్షన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15 వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

కాగా, కియారా అద్వానీ టైమ్‌కి షూటింగ్‌కి హాజరు కావడం లేదనీ, ఆమె కారణంగానే ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోందనీ స్వయంగా డైరెక్టర్ శంకర్ అసహనం వ్యక్తం చేస్తున్నారనీ ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది.

ఆల్రెడీ ఈ విషయమై కైరా అద్వానీకి శంకర్ రెండు సార్లు వార్నింగ్ కూడా ఇచ్చారట. సౌత్ సినిమా అంటే అంత చిన్న చూపా.? అని గుస్సా అయ్యారట. ప్రస్తుతం చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ పనుల్లో విదేశాల్లో బిజీగా గడుపుతున్నారు. అలాగే, చేతి నిండా ప్రాజెక్టులతో కైరా అద్వానీ బాలీవుడ్‌లో బిజీ బిజీగా గడుపుతోంది.

దాంతో, అనుకున్న టైమ్‌కి అయిపోవాల్సిన #రామ్‌చరణ్ 15 ఆలస్యమవుతూ వస్తోందట. మరోవైపు శంకర్ చేతిలో ‘భారతీయుడు 2’ కూడా వుంది. ఆ ప్రాజెక్ట్ కూడా ముందుకు సాగుతున్నట్లు కనిపించడం లేదట. ఇదీ ఇండస్ర్టీ వర్గాల్లో తాజాగా వినిపిస్తోన్న టాక్.