ఎన్టీయార్ హీరోయిన్.! జాన్వీనా.? రష్మికనా.?

యంగ్ టైగర్ ఎన్టీయార్ కొత్త సినిమా కోసం హీరోయిన్‌గా ఎవరు ఫైనల్ అవుతారు.? అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మొదటి నుంచీ ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం జాన్వీ కపూర్ పేరునే ఫైనల్ చేసుకున్నారు దర్శకుడు కొరటాల శివ, హీరో జూనియర్ ఎన్టీయార్.

జాన్వీ కపూర్ కూడా సూచన ప్రాయంగా ఈ ప్రాజెక్టుకి అంగీకరించింది. కానీ, అధికారికంగా ఈ సినిమాకి ఇంకా ఆమె సైన్ చేయలేదు. అందుకు చాలా కారణాలున్నాయి. సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో తెలియకపోవడంతో, జాన్వీ సైతం ఖచ్చితంగా చెప్పలేకపోతోందట. ఎందుకంటే, ఆమెకీ బోల్డన్ని కమిట్మెంట్స్ వున్నాయి బాలీవుడ్‌లో.

త్వరలో ఎన్టీయార్ – కొరటాల సినిమా పట్టాలెక్కనున్న దరిమిలా, తాజాగా చిత్ర బృందం జాన్వీ కపూర్‌ని సంప్రదించిందట. అయితే, ఆమె ఏ విషయాన్నీ ఫైనల్ చేయలేదట. దాంతో, రెండో ఆప్షన్‌గా రష్మిక మండన్న పేరుని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ జాన్వీ కపూర్ గనుక హీరోయిన్‌గా ఫైనల్ అయితే, రష్మికతో స్పెషల్ సాంగ్ చేయిస్తారని తెలుస్తోంది. రష్మిక హీరోయిన్ అయితే, జాన్వీ స్పెషల్ సాంగ్ అయినా చేస్తుందా.? అదైతే డౌటే.!