చంద్రబాబు చెప్పే కబుర్లను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెగ్యులర్ గా ఈ మాట చెబుతుంటారు. “చెప్పేవాడు చంద్రబాబు అయితే.. వినేవాడు వీపీ సింగ్” అని! ఈ డైలాగ్ బాగా ఫేమస్! ఈ క్రమంలో మరోసారి ఆ డైలాగ్ తెరపైకి రావడానికి కారణం… చంద్రబాబు తాజా వ్యాఖ్యలు!
అవును… తాజాగా మైకుల ముందుకు వచ్చిన చమ్రబాబు తనదైన శైలిలో సెల్ఫ్ డబ్బా వాయించుకున్నారు! ఇందులో భాగంగా… జగన్ దుర్మార్గ పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. అనంతరం… ఏపీలో టీడీపీ ప్రభంజనం వీస్తుందని చెప్పుకొచ్చారు.
ఇప్పటికే కేంద్రంలో బీజేపీతో పొత్తుల కోసం అర్రులు చాస్తూ, మరో పక్క జనసేనను చంకన పెట్టుకుని ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని తపిస్తున్న చంద్రబాబు.. అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడటం గమనార్హం. ఇదే సమయంలో… కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేది బీజేపీ అని జోస్యం చెప్పారు. దీంతో బీజేపీ ప్రాపకంకోసం బాబు పడే తపన మామూలుగా లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో తాము పొత్తుల కోసం తలుపులు తెరిచి ఉంచినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. అదేవిధంగా… తెలంగాణలో బీజేపీతో పొత్తు అంశానికి సమయం దాటిపోయిందని చెప్పుకొచ్చారు. ఇలా చంద్రబాబు తనదైన శైలిలో వ్యాక్యానించారు. జోస్యాలు చెప్పుకొచ్చారు.
దీంతో… ఒకపక్క ఒకవైపు జగన్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతూ.. మరోవైపు టీడీపీ ప్రభంజనం వీస్తోందని చెప్పుకుంటున్న చంరబాబు… అందుకు భిన్నంగా పొత్తుల కోసం వెంపర్లాడడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు పరిశీలకులు. చంద్రబాబుకి సమాన్య జనంపై ఎంత చులకనభావం అని వాపోతున్నారు.
చంద్రబాబు చెబుతున్నట్లు నిజంగా ఏపీలో వైసీపీ బలహీనంగా ఉంటే… టీడీపీ ప్రభంజనమే అయితే… ఇక అటు పవన్ ని, ఇటు బీజేపీని సవరదీయడం ఎందుకనేది ఆయనకే తెలియాలి. ఈ విషయంలో బాబు సెల్ఫ్ డబ్బా కబుర్లు ఇంకా మానలేదంటూ కామెంట్లు పెడుతున్న నెటిజన్లు.. చెప్పేవాడు చంద్రబాబు అయితే, వినేవాడు వీపీ సింగ్ అని అంటుండటం గమనార్హం.