CM Revanth Reddy: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంధ్యా థియేటర్లు ఘటనపై వాదనలు ప్రతి వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. తెలంగాణ రాజకీయాలలో ఇదే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఘటనపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో చర్చలు కూడా జరిగాయి. దీంతో ఆ రోజు జరిగిన ఘటన మొత్తం వివరించారు రేవంత్ రెడ్డి. అనంతరం అల్లు అర్జున్ అరెస్టు చేసిన తర్వాత తనపై ఎవరైతే విమర్శలు చేస్తూ తిట్టారో వారిపై కూడా విమర్శలు చేశారు. అరెస్టు అయిన అల్లు అర్జున్ కి ఏమయ్యిందని సినిమా వాళ్ళు వెళ్లి పలకరించారు.
ఏ ఒక్కరైనా వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. అంతే కాకుండా ఈ ఘటనతో సీఎం రేవంత్ రెడ్డి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుని టాలీవుడ్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. సినిమా తీసుకోండి డబ్బులు సంపాదించుకోండి. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు తీసుకోండి. కాని ప్రాణాలు తీస్తామంటే ఒప్పుకోను. ఇకపై టికెట్ ధరల పెంపు బెనిఫిట్ షో లు ఉండవు. నేను సీఎంగా ఉన్నంతకాలం వాటికి అనుమతి ఇవ్వను. సినిమా వాళ్ళు వ్యాపారం చేసుకోండి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఊరుకోము అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటన గురించి సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి ఈ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో టాలీవుడ్ కి గట్టి దెబ్బె తగిలేలా ఉంది. సినీ నిర్మాతలు ఈ వ్యాఖ్యలకు షాక్ అవుతున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు తీసేవాళ్ళు రేట్లు పెంచకపోతే, బెనిఫిట్ షోలు లేకపోతే తీవ్రంగా నష్టపోక తప్పదు. దీంతో టాలీవుడ్ నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ కామెంట్స్ తో హీరోల అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు. ఇకపై నైజాంలో రికార్డులు రావడం కష్టమే, బెనిఫిట్ షోలు కష్టమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై టాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందిస్తారా చూడాలి మరి.