గతకొంతకాలంగా యువగళం పాదయాత్ర పేరు చెప్పి నారా లోకేష్ రోడ్లపై నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వారాహి యాత్ర అంటూ పవన్ లారీ ఎక్కి ప్రసంగిస్తున్నారు! ఇదే సమయంలో భవిష్యత్తుకు భరోసా పేరుతో రూపొందించిన మినీ మేనిఫెస్టో ప్రచారంలో భాగంగా చంద్రబాబు బస్సు యాత్ర చేస్తున్నారు.
ఈ యాత్రలకు, వాటి తాలూకా సభలకూ వస్తోన్న ప్రజాధరణ సంగతి కాసేపు పక్కనపెడితే… ఈ సభలలో అధికార పార్టీపై వారు చేస్తున్న విమర్శలు మాత్రం బౌన్స్ బ్యాక్ అవుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ చేసే విమర్శలవల్ల సమాజంలో ఉన్న గౌరవం పోగొట్టుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక లోకేష్ ప్రసంగాలు.. అందులో దొర్లే ఆణిముత్యాల సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు మాత్రం తాజగా విజన్ 2047 పెట్టారు. పూర్ ని రిచ్ చేస్తానని, రైతుని రాజుని చేస్తానని, పేదవారు లేకుండా చేసే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పుకొస్తున్నారు. ఇంతాకాలం చేమి చేశారయ్యా అంటే… మాట దాటేస్తున్నారు.
ఈ సమయంలో ముగ్గిరిపైనా కలిసి ఏపీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా విపక్ష నేతలపై చురకులు వేయడం, వెటకారాలు ఆడటంలో సిద్ధహస్తులనే పేరు సంపాదించుకున్న వైసీపీ నేతల్లో అంబటి ఒకరని అంటుంటారు. ఈ సమయంలో తాజాగా ఒక ట్వీట్ చేశారు.
“బాబు గారు బస్సు ఎక్కాడు
పప్పు పుత్రుడు రోడ్ ఎక్కాడు
దత్తపుత్రుడు లారీ ఎక్కాడు
కానీ… గద్దెనెక్కడం అసాధ్యం!”
అని ప్రాసల పరోటాలు వేశారు అంబటి రాంబాబు. దీంతో అంబటి ముగ్గురికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కాగా.. కాగా ఇటీవల విడుదల అయిన బ్రో సినిమా రచ్చలో సినిమా కంటే అంబటి వ్యాఖ్యల గురించే చర్చ మొత్తం నడిచిన సంగతి తెలిసిందే. పవన్ కు సపోర్టుగా పాదయాత్రలో లోకేష్, చంద్రబాబులు కూడా అంబటిపై విమర్శలు కురిపించారు. నాటి నుంచి పవన్ & కో పై అంబటి రాంబాబు అవకాశం వచ్చినప్పుడల్లా వితౌట్ గ్యాప్ వాయిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!