పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన అవసరం అక్కర్లేదు రాజకీయాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సినిమాలు కోసం డేట్స్ ఇస్తూ ఉండటం బట్టి చూస్తుంటే అతనికి సినిమాలు మీద ఉన్న ప్యాషన్ ఏమిటో అర్థమవుతుంది.డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తూనే గతంలో ఒప్పుకున్న సినిమాలను, ప్రస్తుతం తాను చేయవలసిన సినిమాలను కూడా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు పీకే.
కొద్దిరోజులుగా సినిమాలకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా ఫినిష్ చేసే పనిలో పడ్డారు. అయితే ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు ప్రతి సినిమాలో లాగే పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఐటెం సాంగ్ ఉండబోతుంది. అయితే ఈ సాంగ్లో ఎవరు నటిస్తున్నారు అనే విషయం పై క్లారిటీ లేదు కానీ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అనసూయ హరి హర వీరమల్లు సినిమాలో ఒక సాంగ్ చేస్తున్నాను అని చెప్పటంతో అయితే స్పెషల్ సాంగ్ చేసేది అనసూయ అని ఒక క్లారిటీ కి వచ్చేసారు పీకే ఫ్యాన్స్.
మరి పవన్ పక్కన ఈ అమ్మడు ఎంతవరకు తన టాలెంట్ చూపించుకుంటుందో చూడాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ మరొక సినిమా ఓజీ లో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందని మేకర్స్ ఎప్పుడో రివీల్ చేశారు. అయితే ఆ సాంగ్ లో ఎవరు నటిస్తున్నారు అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే తాజాగా ఈ పాట కోసం డి జె టిల్లు ఫేమ్ నేహా శెట్టి ని తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా నేహా శెట్టి తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ థాయిలాండ్ లో జరుగుతుండగా తాజాగా సినిమా షూటింగ్లో పాల్గొంది నేహా శెట్టి. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ పవర్ స్టార్ తో నేహా వేసే స్టెప్స్ కి థియేటర్స్ షేక్ అవుతాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక భోజి సినిమా దాదాపు షూటింగ్ 70 శాతం పూర్తి చేసుకుందని పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఇంకా 15 రోజులు షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని సమాచారం ప్రస్తుతం.