ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలతో పాటు సర్వే సంస్థల సందడి కూడా ఉంటుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా కూటమి ఏర్పాటు, అభ్యర్థుల ప్రకటనల అనంతరం ఒక సర్వే జరిగినట్లు తెలుస్తుంది. తాజాగా వెలువడిన ఈ సర్వే ఫలితాలు వాస్తవికతకు కాస్త దగ్గరగానే ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. అయితే.. గెలుపు ఎవరిదనే విషయంపై ఈ సర్వే ఫలితాలను వెల్లడించినా.. టఫ్ ఫైట్ మాత్రం తప్పదని చెప్పినట్లయ్యింది.
అవును… ఏపీలో రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ మెజారిటీ స్థానల్లో విజయం సాధిస్తుందని తాజా సర్వే తేలిచింది. ఇందులో భాగంగా… వైసీపీకి 48.5 శాతం ఓట్లు వస్తాయని.. టీడీపీ జనసేన, బీజేపీ కూటమికి 46.5 శాతం ఓట్లు పోలవుతాయని శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ తన సర్వే ఫలితాల్లో వెల్లడించింది. ఇదే సమయంలో ఇతరులకు 3 సాతం, నోటాకు 2 శాతం ఓట్లు రావొచ్చని తెలిపింది.
వివరాళ్లోకి వెళ్తే… ఈసారి ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరగనున్నాయని చెబుతున్న వేళ… రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి 93 నుంచి 106 స్థానాలు వస్తాయని.. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి 50 నుంచి 69 స్థానాలు గెలుచుకుంటుందని ఆత్మసాక్షి సర్వే చెబుతుంది. ఇదే సమయంలో… 25 లోక్ సభ స్థానాల్లోనూ అధికార వైసీపీకి 15 నుంచి 17 స్థానాల్లో విజయం దక్కే అవకాశం ఉందని.. కూటమికి 5 నుంచి 8 స్థానాల్లో గెలుపు దక్కొచ్చని తెలిపింది.
ఇక ఉమ్మడి జిల్లాలవారీగా సర్వే ఫలితాలను గమన్సితే…
శ్రీకాకుళంలో 10 అసెంబ్లీ స్థానాలకు గానూ 5 వైసీపీకి, 2 కూటమికి కన్ ఫాంగా రావొచ్చని తెలిపిన సర్వే సంస్థ… 3 స్థానాల్లో హోరాహోరీ పోరు ఉంటుందని తెలిపింది.
ఉమ్మడి విజయనగరం విజయానికొస్తే… అక్కడున్న 9 స్థానాల్లోనూ వైసీపీ 6, కూటమికి 2 సీట్లు వచ్చే అవకాశం ఉండగా.. 2 స్థానాల్లో పోటాపోటీ పోటీ ఉంటుందని తెలిపింది.
ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలోని 15 స్థానాల్లోనూ 6 వైసీపీకి, 5 కూటమికి దగ్గే అవకాశాలుండగ… 4 స్థానాల్లో హోరాహోరీ తప్పదని స్పష్టం చేసింది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 స్థానాలు ఉండగా… వాటిలో 8 స్థానాలు వైసీపీకి, 7 స్థానాలు కూటమికి వస్తాయని.. మిగిలిన 4 స్థానాల్లో హోరాహోరీ పోటీ ఉందని వెల్లడించింది.
ఇక్కడ ప్రధానంగా పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగ గీతపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మధ్య హోరా హోరీ పోరు తప్పదని, వార్ వన్ సైడ్ కాదని సర్వే చెబుతుంది!
ఇదే సమయంలో… ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ సీట్లు ఉండగా.. వాటిలో వైసీపీకి 7 సీట్లు, కూటమికి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా 4 స్థానాల్లో మాత్రం టఫ్ ఫైట్ తప్పదని చెబుతుంది!
ఇదే క్రమంలో… కృష్ణా జిల్లాలోని మొత్తం 16 స్థానాల్లో 8 స్థానాలు వైసీపీకి, 5 స్థానాలు కూటమికి వస్తాయని.. మిగతా 3 స్థానాల్లో నువ్వా నేనా అన్న పోరు ఉంటుందని వెల్లడించింది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 స్థానాల్లోనూ వైసీపీకి 8 స్థానాలు, కూటమికి 5 స్థానాలు వస్తాయని.. మిగతా 3 స్థానాల్లో పోటాపోటీ ఉందని చెప్పింది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 స్థానాలుండగా… వీటిలో 6 సీట్లు వైసీపీ, 5 సీట్లు కూటమి గెలుచుకునే అవకాశం ఉండగా… ఒక్క స్థానంలో మాత్రం పోటీ నువ్వానేనా అన్నట్లు ఉందని తెలిపింది.
ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 సీట్లుండగా… 4 వైసీపీ, 3 కూటమి గెలుచుకుంటాయని.. మిగతా 3 చోట్ల హోరాహోరీ పోరు సాగుతోందని వెల్లడించింది.
ఇదే సమయంలో… ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లుండగా, 8 సీట్లు వైసీపీకి, ఒక్క సీటు కూటమికి వచ్చే అవకాశం ఉండగా… మిగిలిన ఒక్క స్థానంలో నువ్వానేనా అన్నట్లు పోటీ ఉందని స్పష్టం చేసింది.
ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 స్థానాలుండగా… వైసీపీకి 10, కూటమికి 3 స్థానాలు వస్తాయని.. ఒక్క స్థానంలో హోరాహోరీ పోరు సాగుతోందని తెలిపింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 స్థానాల్లోనూ 7 స్థానాల్లో వైసీపీ, 4 స్థానాల్లో కూటమి విజయం సాధిస్తాయని.. 3 చోట్ల మాతరం హోరాహోరీ పోరు సాగుతోందని వెల్లడించింది.
ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లోనూ… 10 స్థానాలు వైసీపీ, 3 స్థానాలు కూటమి కైవసం చేసుకుంటాయని.. ఒక్క చోట నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉందని స్పష్టం చేసింది.