కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలుగు రాష్ట్ర రాజకీయాలపై కూడా ప్రభావం చూపిస్తాయనేది గత కొన్ని రోజులుగా బలంగా వినిపిస్తున్న మాట. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదలయిన కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త టెన్షన్ మొదలైతే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని చెప్పుకుంటూన్నారు. ఆ సంగతి అలా ఉంటే… ఏపీ రాజకీయాల్లో కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందనే విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.
పవన్ దృష్టంతా ఇప్పుడు కింగ్ మేకర్ గా మారాలనే దానిపైనే ఉంది. తనకు ఏపీలో మెగా బలమున్నా కూడా, ఒంటరిగా బలపడేటంత ఛాన్స్ ఉన్నాకూడా… పవన్ కి అంత ఓపిక లేదు! షార్ట్ కట్ లో అధికారంలోకి వచ్చేయాలని భావిస్తున్నారు! ఈ సమయంలో కర్నాటకలో జేడీఎస్ అధినేత కుమారస్వామి తరహా పాలిటిక్స్ చేయాల్ని ఫిక్సయ్యారు! తనకు టీడీపీ అవసరం కాదు.. తన అవసరం టీడీపీకి ఉండేలా మారాలని కేడర్ కు పిలుపునిస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలొచ్చాయి.
ఆ ఫలితాలు పవన్ భావించినట్లు హంగ్ దిశగా రాలేదు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. బీజేపీకి సైతం జేడీఎస్ తో కలిపి హంగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ కూడా లేకుండా అయిపోయింది. ఇది కచ్చితంగా పవన్ కు బ్యాడ్ న్యూస్ అని అంటున్నారు విశ్లేషకులు. రేపటి రోజున ఏపీలో కూడా ఇలాంటి ఫలితాలేవచ్చి.. వైసీపీకి స్పష్టమైన మెజారిటీ వస్తే… పవన్ ఆశలు అడియాశలైపోయే ఛాన్స్ లేకపోలేదని చెబుతున్నారు.
ఇక గుడ్ న్యూస్ ఏమిటంటే… బీజేపీ టీడీపీ లు కలవాలనేది పవన్ బలమైన కోరిక. ఆ రెండు పార్టీలు కలవాలి, వారి కష్టంపై మధ్యలో తాను లాభపడాలి అనేది ఆయన ప్లాన్! అయితే నిన్నటివరకూ ఈ విషయంపై బీజేపీ స్పందించలేదు. కానీ.. తాజా కర్ణాటక ఫలితాలు బీజేపీకి గట్టి షాకిచ్చాయి కాబట్టి… ఏపీలో పొత్తుల విషయంలో బీజేపీ కాస్త దృష్టి సారించొచ్చని అంటున్నారు విశ్లేషకులు. ఇది పవన్ ను గుడ్ న్యూస్ గా వారి అభివర్ణిస్తున్నారు!