జాన్వీ ఒప్పుకుందా.? లేదా.? ఈ హైడ్రామా ఎందుకు.?

యంగ్ టైగర్ ఎన్టీయార్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది.? అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే వుంది. ఇదిగో, అదిగో.. అంటూ రోజులు, నెలలు గడిపేస్తున్నారు.

మరోపక్క, హీరోయిన్ విషయమై గందరగోళం కొనసాగుతూనే వుంది. అదిగో దీపికా పడుకొనే, ఇదిగో జాన్వీ కపూర్, కాదు కాదు రష్మిక మండన్న.. ఇలా బోల్డన్ని పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. వీటిల్లో చాలావరకు లీకులే.

ఇంతకీ, ఈ లీకులు బయటకు వదులుతున్నదెవరు.? చిత్ర నిర్మాణ సంస్థే స్వయంగా ఈ లీకుల్ని పంపుతోందన్నది ఓ వాదన. అందులో నిజమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటించడం దాదాపు అసాధ్యమేనన్నది తాజా ఖబర్.

మొన్నామధ్య జాన్వీ చూచాయిగా ఓకే చెప్పేసిందంటూ లీకు బయటకు వచ్చింది. తాజా లీకుల సారాంశం జాన్వీ ‘నో’ చెప్పేసిందని. ఆమె స్థానంలో బాలీవుడ్ బ్యూటీనే తీసుకురావాలని ఎన్టీయార్ అనుకుంటున్నాడట. కొరటాల మాత్రం ఈ విషయంలో కొంత విభేదిస్తున్నాడని సమాచారం.