ఎన్నికలు సమీపిస్తున్నాయంటే… దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ ప్రకటనలతో ఊదరగొట్టేస్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని పార్టీలైతే సినిమా నటులతోనూ వీడియో యాడ్స్ వదులుతుంటాయి. గత ఎన్నికల్లో ఇలాంటివి కోకొల్లలుగా వచ్చాయి. అయితే… వాటిలో ఆయా పార్టీలు ఇచ్చే హామీలను ప్రచారం చేస్తుంటాయి. కానీ… తాజాగా జనసేన విడుదల చేసిన వీడియో ప్రకటన మాత్రం క్రియేటివ్ గా ఉందనే కామెంట్లను సొంతం చేసుకుంది.
అవును… తాజాగా విడుదలైన జనసేన పొలిటికల్ యాడ్ చాలా విభిన్నంగా ఉంది. అందులో ఫేస్ కనిపించకపోయినా స్వయంగా పవన్ కల్యణే నటించడం విశేషం. వీలైనంత అర్థవంతంగా ఉన్న ఈ యాడ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇదే సమయంలో ఈ యాడ్ చూసిన అనంతరం విమర్శల్లో భాగంగా కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.. అవి కూడా ఈ యాడ్ లాగే డిఫరెంట్ గా ఉండటం గమనార్హం.
తాజాగా విడుదలైన జనసేన పొలిటికల్ యాడ్ లో… ఒక రూమ్ లో ఫ్యాన్ స్విచ్ వేయగానే.. టేబుల్ మీద ఉన్న పేపర్స్ అన్ని చెల్లాచెదురుగా పడిపోతాయి. ఆ పేపర్స్ పై అభివృద్ధి, పోలవరం, ఉద్యోగాలు, మౌలిక వసతులు, వ్యవసాయం మొదలైనవి రాసి ఉంటాయి. ఈ సమయంలో ఎంటరైన పవన్.. ఫ్యాన్ ఆపేసి, ఆ పేపర్స్ ను ఏరి, కూర్చి తిరిగి టేబుల్ పై పెడతాడు. అవి తిరిగి ఎగిరిపోకుండా ఆ పేపర్స్ పై గాజు గ్లాసును పెడతారు.
ఆ సమయంలో గాజు ఫ్లాసు ఉన్న టేబుల్ పక్కనే కమళం, సైకిల్ సింబల్స్ తో ఉన్న ఒక వస్తువు ఉంటుంది. అనంతరం ముందుకు వెళ్లిన పవన్ ఆ టేబుల్ ముందు ఉన్న కుర్చీపై చేయిపెట్టి పక్కన నిలబడతారు. దీంతో… ఈ యాడ్ క్రికేటివిటీకి ఫుల్ మార్కులు పడుతున్నాయని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
ఆ సంగతి అలా ఉంటే… ఈ వీడియోకి క్యాప్షన్ గా “ఫ్యాను గాలికి కొట్టుకుపోతున్న రాష్ట్ర భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టే బాధ్యతను చేపట్టిన గాజు గ్లాసు” అని రాసుంది. దీంతో వైసీపీ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టారు.. విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇందులో భాగాంగా… “21 సీట్లతో ఏమి బాధ్యత తీసుకున్నారో చెబుతారా” అని ఒకరంటే… “కనీసం ప్రకటనలో కూడా కుర్చీలో కుర్చోరా సర్… అక్కడ కూడా కుర్చీ పక్కన నిలబడటమేనా” అని ప్రశ్నిస్తుండటం గమనార్హం.
దీంతో… పవన్ ఫేస్ కనిపించకపోయినా.. కనీసం ఆ కుర్చీలో కూర్చిని ఉంటే ఈ ప్రకటనకు పరిపూర్ణత వచ్చేదని.. యాడ్ లో కూడా కుర్చీపక్కన నిలబడటం బాగాలేదని అంటున్నారు. అది మినహా యాడ్ మాత్రం సూపర్ అనేది ఫైనల్ వర్డ్!
"ఫ్యాను" గాలికి కొట్టుకుపోతున్న రాష్ట్ర భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టే బాధ్యతను చేపట్టిన "గాజు గ్లాసు."#JanasenaFormationDay#BJP #JSP #TDP#HelloAP_ByeByeYCP pic.twitter.com/idTuQM0yx3
— JanaSena Party (@JanaSenaParty) March 14, 2024