“వన్ డే శాలరీ ఫర్ జనసేన – మన పార్టీ, మన బాధ్యత” అంటూ ఆన్ లైన్ లో విరాళాలు ఆహ్వానిస్తోంది జనసేన పార్టీ. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ విరాళాలు సేకరిస్తున్నారు. 10 రూపాయలతో మొదలు పెట్టి ఎంత పెద్ద మొత్తంలో అయినా ఈ విరాళాలు ఇవ్వొచ్చని నాగబాబు ఈ ప్రచారాన్ని మొదలుపెట్టారు.
అవును… ఫోన్ పే, పేటీఎం ద్వారా పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా చందాలు ఇవ్వాలని అడుగుతుంది జనసేన. అలా అని ఇదేమీ పవన్ కల్యాణ్ బర్త్ డే పార్టీ కోసం కాదు సుమా… జనసేన పార్టీ కోసం! ఇందులో భాగంగా రోజువారీ కూలిపనులు చేసుకునేవారి నుంచి రోజుకు రెండు కోట్లు సంపాదించేవారి వరకూ అందరూ ఒకరోజు జీతాన్ని జనసేనకు ఇవ్వాలి!
ఇప్పటికే నాగబాబు ఈ విషయంలో ఫోన్ పే, పేటీఎం ఏదైనా పర్లేదు కొట్టండి అని చెబుతుంటే… మిగతా నాయకులు, సినీ ఇండస్ట్రీలో ఉన్న జనసేన అభిమానులు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లే పనికి పూనుకున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా జనసేన పార్టీకి విరాళం ఇచ్చే ముందు వివరాలు సరిచూసుకోండి అని కూడా జాగ్రత్తలు చెబుతున్నారు.
"నా సేన కోసం నా వంతు"
జనసేన పార్టీకి విరాళం ఇవ్వడానికి ఈ QR కోడ్ ను ఉపయోగించగలరు.
You can also donate through ; https://t.co/YVa6nbygr1#నా_సేన_కోసం_నా_వంతు#MyJANASENA_MyContribution pic.twitter.com/6L2wY96okr
— JanaSena Party (@JanaSenaParty) August 31, 2023
అయితే ఇప్పుడు చేపట్టిన ఈ ప్రచారమే ఇప్పుడు వివాదాలకు దారితీస్తుంది. అవును… ఈ ప్రచారమే ఇప్పుడు విమర్శలకు కారణం అవుతోంది. రాజకీయ పార్టీకి విరాళాలు తీసుకోవడం సహజం! అయితే మరీ ఇంత పబ్లిక్ గా ప్రజలనుంచి వన్ డే శాలరీని అభ్యర్థించడం ఏంటి అని వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ సెటైర్లు పేలుస్తున్నాయి. ఇందులో భాగంగా… రోజుకు 2కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే హీరోకి ఈ విరాళాల కష్టాలేంటి అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.
ఏపీ ప్రజలు గ్రహించాలి!!
ఇద్దరూ యాక్టర్లే..
ఒకరు పవర్ స్టార్ గా రోజుకు 2కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడు.
ఇంకొకరు డ్యాన్సర్ స్థాయి నుంచి యాక్టర్ గా ఎదిగిన వ్యక్తి.
సమాజ సేవ చేస్తున్నాను నాకు విరాళాలు వద్దు నా డబ్బుతోనే చేయిస్తాను అంటే ఇంకో ఆయన ఓ వైపు ప్యాకేజీ తీసుకుంటూ ఇంకో… pic.twitter.com/fXf87z9QS6
— Sajjala Bhargava Reddy (@SajjalaBhargava) August 30, 2023
ఎక్కడికెళ్లినా ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ లలో తిరిగే వ్యక్తిని… సామాన్య ప్రజలు విరాళాలివ్వడమేంటనేది వైసీపీ అడుగుతున్న లాజిక్. ఇదే సమయంలో… దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్రయత్నంలో భాగమనే కామెంట్లూ వినిపిస్తుండటం గమనార్హం.