సినీ నటుడు నాని, తన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’ ప్రమోషన్ల కోసం రాజకీయాల్ని గట్టిగా వాడేస్తున్నాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘హాయ్ నాన్న’ సినిమా మాత్రమే కాదు, చాలా సినిమాలు ‘పొలిటికల్ టర్న్’ తీసుకున్నాయి పబ్లిసిటీ పరంగా.!
అయితే, నాని ఇంకో అడుగు ముందుకేశాడు. మీడియా మీద సెటైర్లేస్తున్నాడు. రాజకీయ పార్టీల మీదా, రాజకీయ నాయకుల మీదా సెటైర్లేస్తున్నాడు. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా సమయంలో నాని చాలా పొలిటికల్ హీట్ ఎదుర్కొన్నాడు ఆంధ్రప్రదేశ్‌లో. అప్పట్లో, జనసేనాని పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా నాని నిలవడంతోనే, ఆ పరిస్థితి ఎదురయ్యింది.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే ఎన్నికల్లో.. అంటే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అలాగే, దేశవ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున నాని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడని తెలుస్తోంది.
ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొంటాడా.? లేదంటే, జనసేన తరఫున ప్రకటనల్లో నటిస్తాడా.? అన్నదానిపై ఇంకాస్త స్పష్టత రావాల్సి వుంది. ఏం చేసినా, నాని రాజకీయాల్లోకి వచ్చేసినట్లే అవుతుంది.
నాని మాత్రమే కాదు, ఇంకొందరు సినీ ప్రముఖులు కూడా ఈసారి జనసేనకు మద్దతుగా నినదించే అవకాశం వుందట.