ఏపీరాజకీయాల్లో “వ్యూహం” ఎఫెక్ట్ మొదలైపోయింది. టీజర్ చూసే అప్పుడే వర్మకు వార్నింగులు మొదలైపోయాయి. ఆ సినిమాలో ఏదైనా తేడాగా చూపిస్తే దర్శకుడు రాం గోపాల్ వర్మను బట్టలు ఊడదీసి కొడతాం అంటూ వార్నింగులు మొదలైపోయాయి. అయితే ఇలాంటి వార్నింగులు వర్మకు కొత్తకాని సంగతి కాసేపు పక్కనపెడితే… అసలు ఏమి జరిగిందనేది ఇప్పుడు చూద్దాం.
జగన్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిస్తున్న “వ్యూహం” సినిమా టీజర్ విడుదలై ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ, అటు రాజకీయాల్లోనూ కూడా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అందులో వైఎస్సార్ హెలీకాప్టర్ ప్రమాధం నుంచి రాజకీయంగా జగన్ చేసిన రాజకీయ పోరాటం హైలైట్ చేశారని తెలుస్తుంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం కథ మొదలవుతాదని టీజర్ ఊస్తే అర్ధమవుతుంది. అక్కడ మొదలై… జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఈ కథ నడొచ్చని అంటున్నారు. దీంతో… జగన్ పొలిటికల్ ఎంట్రీ కథలో… కచ్చితంగా కీలకంగా కాంగ్రెస్ పార్టీ పాత్ర, సోనియా గాంధీ పాత్ర అత్యంత కీలకం.
మరి ఈ సినిమాలో ఆర్జీవి కచ్చితంగా సోనియా పాత్రను, కాంగ్రెస్ పార్టీ నాయకుల పాత్రనూ హైలైట్ చేసే ఛాన్స్ ఉంది. టీజర్ చూస్తేనే ఈ విషయం అర్ధమవుతుంది. దీంతో… ఏపీ కాంగ్రెస్ నేతలు మైకులముందుకు వస్తున్నారు. వర్మకు వార్నింగులు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మైకందుకున్నారు.
“వ్యూహం సినిమాలో సోనియా గాంధీని చెడుగా చూపిస్తే బట్టలూడదీసి కొడతాం.. ఖబడ్దార్” అంటూ హెచ్చరించారు. రాం గోపాల్ వర్మకు మెంటల్ బ్యాలెన్స్ లేదని ఆరోపించారు. వాస్తవాలు వర్మకు తెలుసా అని ప్రశ్నించారు. దీంతో… వ్యూహం టీజర్ ఏపీ రాజకీయాల్లో కాక పెట్టడం మొదలైపోయిందని అంటున్నారు విమర్శకులు.