నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తిసురేశ్ -ఇటీవలే ఆంథోని తటిల్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆంథోని తటిల్ హిందూ సంప్రదాయ పద్దతిలో కీర్తిసురేశ్ మెడలో మూడు ముళ్లు వేశాడు. ఆ తర్వాత క్రిస్ట్రియన్ సంప్రదాయంలో కూడా పెళ్లి చేసుకున్నారు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన కీర్తిసురేశ్ దంపతులకు ఇండస్ట్రీ ప్రముఖులు, స్నేహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజాగా స్టార్ హీరో నవ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఫొటోలతోపాటు వెడ్డింగ్ గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతోంది. సంప్రదాయ వస్త్రధారణలో వధూవరులిద్దరు కలర్‌ఫుల్‌గా మెరిసిపోతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో తో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్‌తో కలిసి కీర్తిసురేశ్ నటిస్తోన్న బేబిజాన్ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. బేబిజాన్ కీర్తిసురేశ్‌కు హిందీలో తొలి సినిమా.