Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీపై కుట్ర జరుగుతోందో అంటే అవును అని తెలుస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీపై ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలను కనుక చూస్తే ఇందులో ఏపీ ప్రభుత్వ ప్రమేయం కూడా ఉందని తెలుస్తోంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే విషయంలో కాదు ఏపీకి ఎలాగైనా టాలీవుడ్ చిత్ర పరిశ్రమను తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తుందని తెలుస్తోంది.
2014 తెలంగాణ విడిపోయిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ లోనే ఉంది ఆంధ్రప్రదేశ్ కి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ రావడానికి ఏమాత్రం ఇష్టపడదు ఎందుకంటే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిన నగరం కావడంతో ఇండస్ట్రీ కూడా ఏపీకి రావడానికి ఇష్టపడదు ఆ విషయం చంద్రబాబు నాయుడుకి తెలిసినప్పటికీ కూడా చిత్ర పరిశ్రమ ఏపీకి తరలి రావాలని అప్పట్లో సూచించారు.
తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాల ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి ఏపీలో కూడా కొన్ని సినిమాల షూటింగ్స్ నిర్వహించాలని ఇక్కడ కూడా స్టూడియో నిర్మాణాల ఏర్పాటుకు స్థలం కేటాయించడం వంటివి చేస్తామని అప్పట్లో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు అయితే 2019 ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోయారు. గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్ తెలుగు చిత్రపరిశ్రమను ఏపీకి రావాలని సూచించారు వైజాగ్ లో వారికి స్థలాలు కూడా కేటాయిస్తామని జగన్ తన వంతు ప్రయత్నం కూడా చేశారు.
ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ క్రమంలోనే ఏపీకి ఎలాగైనా చిత్ర పరిశ్రమను తీసుకురావాలని భావిస్తున్నారు అంతేకాకుండా ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీలో మంచి స్టార్ ఉన్న హీరో కావడంతో ఆయన కూడా అదే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలోనే అల్లు అర్జున్ వివాదం తెరపైకి రావడంతో పురందేశ్వరి పవన్ కళ్యాణ్ వంటి వారందరూ కూడా చిత్ర పరిశ్రమ ఏపీకి రావాలి అంటూ డైరెక్ట్ గా కామెంట్ చేయడంతో ఇండస్ట్రీని ఎలాగైనా ఏపీకి తీసుకురావాలని ఈ విధమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ పై టాలీవుడ్ ద్వేషం కలిగించేలా వ్యతిరేక మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది.
సినీ కధానాయకుడిగా @alluarjun గారు ఆనాడు థియేటర్ వద్దకు వెళ్లారు.ఇది అతను ప్రేరేపించిన ఘటన కాదు. pic.twitter.com/k5HEG53xR5
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) December 22, 2024