TG: సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి ఎంతో మంచి అభినాభావ సంబంధం ఉందని చెప్పాలి. ఇలా ఎంతోమంది సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు రాజకీయాలలో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే ఇప్పుడు కూడా ఎంతోమంది రాజకీయాలలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది సినిమా సెలబ్రిటీలు రాజకీయ పార్టీలకు మద్దతుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారు.
ఇక సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ స్థాపించడంతో ఈయనకు కూడా సినిమా సెలబ్రిటీల మద్దతు ఉందని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో మాత్రం సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ పార్టీ లాగా మారిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా పెద్ద ఎత్తున రాజకీయాలు జరుగుతున్నాయి.
గతంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని తొక్కేశారు అంటూ అప్పట్లో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు విమర్శించారు అయితే ఆయన పేదవారికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ థియేటర్ కు వెళ్లి సినిమా చూసే విధంగా సినిమా టికెట్ల రేట్లు పెంచారు. అలాగే అదనపు షోలకు ఎలాంటి అనుమతులు తెలుపలేదు. దీంతో చిత్ర పరిశ్రమ మొత్తం జగన్మోహన్ రెడ్డి పై దాడి చేస్తూ ఆయన ఓటమికి కూడా పరోక్షంగా కృషి చేశారని చెప్పాలి.
ఇక చంద్రబాబు నాయుడు తిరిగే అధికారంలోకి రావడంతో ఎంతో మంది జగన్ ఓటమిని బహిరంగంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇలా గతంలో ఏపీ ప్రభుత్వంతో చిత్ర పరిశ్రమకు విభేదం ఏర్పడింది అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా చిత్ర పరిశ్రమకు విభేదాలు ఏర్పడుతున్నాయని తెలుస్తుంది. రేవంత్ రెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తిగా టార్గెట్ చేశారని అందుకే తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలకు అదే విధంగా సినిమా టికెట్ల రేట్లు పెంచడానికి వీలు లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడమే కాకుండా ఇండస్ట్రీలో చర్చలకు కారణం అవుతున్నాయి. ఇలా గతంలో ఏపీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి.