పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కేసేలాటలో అల్లు అర్జున్ అభిమాని రేవతి చనిపోగా ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రస్తుతం అతను కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం లో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మొత్తం అల్లు అర్జున్ ని పరామర్శించింది.
అయితే దీనిపై సీఎంరేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. అల్లు అర్జున్ కి ఏం జరిగిందని అతడిని పరామర్శిస్తున్నారు. ఒక్కరోజు జైలుకు వెళ్లి వస్తే సినీ ప్రముఖులు అతని ఇంటికి క్యూ కట్టారు అంతేకానీ చనిపోయిన రేవతి కుటుంబాన్ని గాని ప్రాణాలతో పోరాడుతున్న ఆ బాబుని గాని ఒకరు కూడా వచ్చి పలకరించలేదు. పైగా తొక్కిసలాటకు అల్లు అర్జున్ రోడ్డు షో కారణమని హీరో బాధ్యత లేకుండా ప్రవర్తించడం వల్లనే అలాంటి ఒక దురదృష్ట సంఘటన జరిగిందని, దీనికి బాధ్యత అల్లు అర్జున్ దే అని ఫైర్ అయ్యారు.
అంతేకాకుండా ఇకపై తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్స్ కి పర్మిషన్ ఉండదని చెప్పేశారు . అయితే ఈ సంఘటన పట్ల సినీ నటుడు జగపతిబాబు స్పందించారు. శ్రీతేజ్ కుటుంబాన్ని కలిశాను అంటూ ఒక ట్వీట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు జగపతిబాబు. సంధ్యా ధియేటర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి హాస్పిటల్ కి వెళ్లాను.
నాకు బాలుడు తండ్రి సోదరి ని పలకరించాలనిపించి వెళ్ళాను. ఆ దేవుడి దయ వలన బాబు త్వరగా నే కోరుకుంటాడని భరోసా ఇచ్చి వచ్చాను. ఈ సంఘటన వలన ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ కుటుంబమే కాబట్టి నా వంతు సపోర్ట్ ఇవ్వాలనుకున్నాను. అయితే పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఈ విషయం ఎవరికీ తెలియదు. అందుకే విమర్శలు వస్తున్నాయి అయితే క్లారిటీ ఇవ్వటం కోసమే నేను ఈ పోస్ట్ పెడుతున్నాను అంటూ వీడియో పోస్ట్ చేశారు జగపతిబాబు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.
— Jaggu Bhai (@IamJagguBhai) December 22, 2024