Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వివాదం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనూ ఇటు చిత్రపరిశ్రమలో కూడా సంచలనంగా మారింది. ఈయనని తొక్కిసలాట ఘటనలో భాగంగా అరెస్టు చేసి ఒక రోజంతా జైల్లోనే ఉంచడమే కాకుండా అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. ఇలా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తన తప్పులేదు అంటూ చెప్పుకువచ్చారు.
ఇలా అప్పటివరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున వివాదంగా మారడమే కాకుండా ఎంతో మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు పోలీస్ అధికారులు కూడా అల్లు అర్జున్ పూర్తిగా తప్పుపడుతూ విమర్శించారు దీంతో కొందరు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి కూడా దిగారు. ఇలా అల్లు అర్జున్ విషయం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ విధంగా రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ టార్గెట్ చేయడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే పలువురు అల్లు అర్జున్ టార్గెట్ అవడం వెనుక కేటీఆర్ ఉన్నారని తెలుస్తోంది. కేటీఆర్ అల్లు అర్జున్ అరెస్టులను పూర్తిగా తప్పు పడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు అంతటితో ఆగకుండా ఈయన ఈ ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్ రెడ్డి పై విమర్శించారు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడంతోనే తీసుకెళ్లి జైల్లో పెట్టాడు అంటూ మాటిమాటికి గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డిని పరోక్షంగా రెచ్చగొట్టారని అందుకే రేవంత్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలు అందరూ కూడా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా తెలంగాణ సర్కారు ధోరణి కూడా పూర్తిగా తప్పు పట్టడంతో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పూర్తిగా టార్గెట్ చేశారని తెలుస్తుంది.